భావి తరాలకు స్ఫూర్తిదాయకుడు కాళోజీ


Sun,September 8, 2019 11:45 PM

భువనగిరి, నమస్తే తెలంగాణ : భావి తరాలకు స్ఫూర్తిదాయకుడు కాళోజీ అని తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ నాళేశ్వరం శంకరం, డాక్టర్‌ కూరెళ్ల విఠలాచార్య, స్వాతంత్య్ర సమరయోధుడు జైని మల్లయ్యగుప్తా, నమస్తే తెలంగాణ సహసంపాదకుడు సామ మల్లారెడ్డి, డాక్టర్‌ పోరెడ్డి రంగయ్యలు అన్నారు. సామాజిక అధ్యాయన వేదిక, చైతన్య సమితిల ఆధ్వర్యం లో సంయుక్తంగా ఆదివారం పట్టణంలోని పెన్షనర్‌ భవన్‌లో నిర్వహించిన తెలంగాణ భాషాదినోత్సవం, కాళో జీ జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. కాళోజీ కళలను సాకారం చేసేందుకు సాహితీ సం స్థలు ముందుండాలన్నారు. కాళో జీ జయంతి సందర్భంగా తెలంగాణ మాతృ భాషా దినోత్సవం జరుపుకోవడం సంతోషదాయకమన్నారు. ఈ సందర్భంగా దాశరథి అవార్డు గ్రహీత కూరెళ్ల విఠలాచార్యను సన్మానించారు. ఈ కార్యక్రమంలో వి, శ్రీనివాసాచారి, భట్టు రామచంద్రయ్య, పోత్నక్‌ ప్రమోద్‌కుమార్‌, బండారు జయశ్రీ, కాచరాజు జయప్రకాశ్‌, హమీద్‌పాష, పోలి శంకర్‌రెడ్డి, జంపాల అంజయ్య, చెన్నయ్య, రాజయ్య, సుజాత తదితరు లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...