ఎమ్మెల్యే రాజ్‌గోపాల్‌రెడ్డి ప్రత్యేక పూజలు..


Sun,September 8, 2019 11:45 PM

భువనగిరి అర్బన్‌ : ప్రశాంత వాతావరణంలో గణేశ్‌ ఉత్సవాలు జరుపుకోవాలని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని పహాడినగర్‌లో ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద ఆదివారం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ భక్తి భావన పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తంగళ్లపల్లి రవికుమార్‌, పొతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు, బర్రె జహంగీర్‌, వడిచెర్ల కృష్ణయాదవ్‌, వడిచెర్ల యాదగిరి యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా ప్రెండ్స్‌యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని ఏఎంఆర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సర్దార్‌ సిదార్థ యూత్‌ ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ పోటీలు నిర్వహించారు. ఆర్‌బీనగర్‌ ఉప్పలమ్మ దేవాలయం సమీపంలో ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద అన్నదాన కార్యక్రమం, ఇండియన్‌ మిషన్‌ హైస్కూల్‌ వెనుకభాగంలో ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద ముస్లిం మైనార్టి నాయకులు ఎండీ అవేస్‌చిస్తీ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు సామ రవీందర్‌రెడ్డి, ఎండీ అఖిల్‌, గుర్రాల ఎల్లేశ్‌, ప్రదీప్‌, పొతంశెట్టి శ్రీను, నాగరాజు, అక్బర్‌, ముత్తు తదితరులు పాల్గొన్నారు.

‘అన్నిదానాల్లో.. అన్నదానం మిన్న’..
బీబీనగర్‌ : అన్నిదానాల్లో అన్నదానం మిన్న.. అన్నదానం మహాదానమని జడ్పీటీసీ గోళి ప్రణీతాపింగళ్‌రెడ్డి అన్నారు. ఆదివారం బీబీనగర్‌లోని శివాలయం వద్ద ప్రతిష్టించిన వినాయకుడి వద్ద స్థానిక సర్పంచ్‌ మల్లగారి భాగ్యలక్షీశ్రీనివాస్‌తో కలిసి జడ్పీటీసీ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. వెంకిర్యాలలో గంగపుత్ర అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు సతీసమేతంగా కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి వద్ద కాంగ్రెస్‌ బ్లాక్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు చెర్కు అచ్చయ్యగౌడ్‌, తదితర నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. పల్లెగూడెంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు పొట్టోళ్ల శ్యాంగౌడ్‌, బీబీనగర్‌లోని ఫ్రెండ్స్‌ యూత్‌ గణనాథుడి వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎంపీటీసీలు గోళి నరేందర్‌రెడ్డి, టంటం భార్గవ్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...