గణనాథులకు ప్రత్యేక పూజలు


Sun,September 8, 2019 11:44 PM

వలిగొండ : మండలంలోని సుంకిశాల, లింగరాజుపల్లి గ్రామాల్లో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి పర్యటించారు. ఆదివారం సుంకిశాల గ్రామంలో టీఆర్‌ఎస్‌ నాయకులు చెర్కు శివయ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో సందీప్‌రెడ్డికి ఘన స్వాగతం పలికారు. శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం గ్రామంలో వినాయక విగ్రహం వద్ద ప్రత్యేక పూజలతోపాటు పీర్ల కొట్టంలో పూజలు చేశారు. వినాయక భక్త మండలి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సందీప్‌రెడ్డిని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు చెర్కు శివయ్య, గ్రామ సర్పంచ్‌ మొగిలిపాక నర్సింహ, లింగరాజుపల్లి సర్పంచ్‌ బొడ్డుపల్లి ఉమాకృష్ణ, మెట్టు కొండల్‌రెడ్డి, సుంకిశాల గ్రామ శాఖ అధ్యక్షుడు రాగీరు మల్లేశం, టీఆర్‌ఎస్‌ యువ నాయకులు వంగాల రోహిత్‌గౌడ్‌, యూత్‌ అధ్యక్షుడు ఎమ్మె లింగస్వామి, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు శాంతికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...