చౌటుప్పల్ మున్సిపాలిటీని కైవసం చేసుకుంటాం


Sat,September 7, 2019 11:32 PM

-మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
-చౌటుప్పల్‌లో టీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం

చౌటుప్పల్, నమస్తేతెలంగాణ: చౌటుప్పల్ మున్సిపాలిటీని టీఆర్‌ఎస్ కైవసం చేసుకోవడం నల్లేరుమీద నడకేనని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి ఎనిమిది నెలల కావొస్తున్నా ఒక్క అభివృద్ధి పని కూడా చేయకుండా ప్రజల్లో పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయాడన్నారు. నవోదయ ఫంక్షన్‌హాల్‌లో శనివారం నిర్వహించిన టీఆర్‌ఎస్ మున్సిపాలిటీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎన్నికల ఇన్‌చార్జి కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు జెల్లా మార్కండేయులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ అబద్దాలతో పదవి చేజిక్కించుకున్న రాజగోపాల్‌రెడ్డిని అబద్దాల కోరుగా ప్రజలు గుర్తిస్తున్నారని తెలిపారు. కోమటి నియోజకవర్గ అభివృద్ధికి చేసింది శూన్యమని, ఈప్రాంతానికి శనిలా దాపురించాడని ప్రజలు బాధపడుతున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల దగ్గరికెళ్లి ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు. చౌటుప్పల్‌ను జెట్‌స్పీడ్‌తో అభివృద్ధి చేశానన్నారు. తెలంగాణకే తలమానికమైన మిషన్‌భగీరథ పైలాన్‌ను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. 60 ఏండ్లలో జరుగని అభివృద్ధిని ఐదేండ్లలోనే చేసి చూపించామన్నారు. మున్సిపాలిటీలో 20కి 20 స్థానాలు టీఆర్‌ఎస్ గెలుచుకోవడం ఖాయమని తెలిపారు. పార్టీ బీ ఫారాలు పొందిన అభ్యర్థుల గెలుపునకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. వార్డులుగావారీగా కౌన్సిలర్లుగా ఉండాలకునే వారు లిస్ట్ ఇవ్వాలని సూచించారు. పకడ్బందీ సర్వే నిర్వహించి గెలుపు గుర్రాలకే బీ ఫారాలు ఇస్తామన్నారు. 20 వార్డుల్లో ప్రతి వార్డుకు ఒక ఇన్‌చార్జిని నియమిస్తామన్నారు.

సీఎం కేసీఆర్‌ను విమర్శించే స్థాయి కోమటిరెడ్డికి లేదు..
తెలంగాణ అభివృద్ధి ప్రదాతగా ప్రజల గుండెల్లో చెరుగని ముద్ర వేసుకున్న సీఎం కేసీఆర్‌ను విమర్శించే స్థాయి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి లేదని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. ఇకపై సీఎం కేసీఆర్‌పై అర్థంలేని వ్యాఖ్యలు చేస్తే సహించేదిలేని హెచ్చరించారు.

20 వార్డుల్లో గెలుపొందాలి..
మున్సిపాలిటీ పరిధిలోని 20వార్డుల్లో గెలుపొంది టీఆర్‌ఎస్ సత్తాచాటాలని టీఆర్‌ఎస్ మున్సిపాలిటీ ఎన్నికల ఇన్‌చార్జి కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ పరిపాలన దక్షతతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. గతంలో జరిగిన ఎంపీపీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 90శాతం పైగా సీట్లు సాధించామన్నారు. అదే ఒరవడిని కొనసాగిస్తూ మున్సిపాలిటీ ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పరిపాలన దక్షతతో ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ఏర్పాటయ్యాయని తెలిపారు. చౌటుప్పల్‌ను చెత్త డంపింగ్ యార్డుగా మార్చాలని చూసిన ఘనత కొమటిరెడ్డి సోదరులకే దక్కుతుందన్నారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా టీఆర్‌ఎస్ విజయం తథ్యమన్నారు. గతంతో జరిగిన తప్పులను పునరావృతం కాకుండా పనిచేయాలన్నారు. వార్డులోని ప్రతి ఇంటిని టచ్‌చేసి ఓట్లు అడుగాలని కోరారు.

తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక..
తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంత ప్రజలు కీలకభూమిక పోషించారని , అదే ఒరవడిని కొనసాగిస్తూ మున్సిపాలిటీని క్లీన్‌స్విప్ చేయాలని టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు జెల్లా మార్కండేయులు కోరారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన 30 రోజుల గ్రామ ప్రణాళికతో ప్రజలకు మరింత దగ్గరయ్యే అవకాశం దొరికిందన్నారు. టీఆర్‌ఎస్ మున్సిపాలిటీ కన్వీనర్ ఊడుగు శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు పెద్దిటి బుచ్చిరెడ్డి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ శ్రీనివాస్, సర్పంచ్‌ల ఫోరం మాజీ మండలాధ్యక్షుడు దయాకరాచారి, రైతు సమన్వయ సమితీ జిల్లా మెంబర్ దామోదర్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేవతి, ఆర్టీఏ జిల్లా మెంబర్ చంద్రకిరణ్, శాఖ గ్రంథాలయం చైర్మన్ మల్లేశ్‌గౌడ్, గొల్ల,కురుమ జేఏసీ జిల్లా కన్వీనర్ అయోధ్యయాదవ్, మాజీ సర్పంచ్ కానుగు బాలరాజు, నాయకులు ఎండీ బాబాషరీఫ్, వెన్‌రెడ్డి రాజు, బొమ్మిరెడ్డి వెంకట్‌రెడ్డి, గుండు మల్లయ్యగౌడ్, చింతల వెంకట్‌రెడ్డి, పరమేశ్ తదితరులు పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...