ప్రభుత్వ దవాఖానలో వసతులు కల్పించాలి


Sat,September 7, 2019 11:29 PM

భువనగిరి అర్బన్: భువనగిరి ప్రభుత్వ ఏరియా దవాఖానలో రోగులకు మౌలిక వసతులు కల్పించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు అన్నారు. శనివారం ఆయన ఏరియా దవాఖానను సందర్శించి రోగుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ల నిర్లక్ష్యంతోనే దవాఖానలో సాధారణ డెలివరీలు తగ్గాయన్నారు. డాక్టర్లు ల్యాబ్‌లతో కుమ్మక్కై ప్రజల సొమ్ము కాజేస్తున్నారని ఆరోపించారు. డాక్టర్ల సకాలంలో విధులకు హాజరుకాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి మెరుగైన వైద్య సేవలందించాలన్నారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రవీందర్, నర్ల నర్సింగ్‌రావు, పడమటి జగన్‌మోహన్‌రెడ్డి, చంద మహేందర్, సుర్వి శ్రీనివాస్, రత్నపురం బలరాం, శ్రీశైలం, జనగాం నర్సింహచారి, రమేశ్, శ్రీధర్ పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...