ఘనంగా గణనాథుడి శోభాయాత్ర


Sat,September 7, 2019 11:28 PM

భూదాన్‌పోచంపల్లి : పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి పంచమ రాత్రులు పూజా కార్యక్రమాలను నిర్వహించి శనివారం నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన వీధుల గుండా వినాయకుడి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు సామ మధుసూదన్‌రెడ్డి, తడక వెంకటేశం, వంగూరి కృష్ణ, గుణిగంటి రమేశ్ గౌడ్, బోడిగె లింగం, శెట్టి నాగరాజు, కుడికాల బాల్‌నర్సింహ, మక్తాల వెంకటేశంగౌడ్, గౌరీశంకర్, వంగూరి పాండు, కీర్తి సంజీవ, పాండు, దుద్యాల బాలకృష్ణ, గుణిగంటి వెంకటేశంగౌడ్, రామ్‌నర్సింహ, గిరి, శ్రీరాములు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

గణనాథుల మండపాల వద్ద అన్నదానం..
భువనగిరి అర్బన్: గణపతి నవరాత్రోత్సవాల్లో భాగంగా పట్టణంలోని పలు మండపాల వద్ద శనివారం అన్నదానం నిర్వహించారు. హనుమాన్‌వాడలో జై యూత్ ఆధ్వర్యంలో, కుమ్మవాడలో, బాబుజగ్జీవన్‌రాం చౌరస్తా సమీపంలో ఏర్పాటు చేసిన గణనాథుల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...