శ్రీవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వర�


Sat,September 7, 2019 11:28 PM

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు నల్లంతీగల్ లక్ష్మీనరసింహాచార్యులు ఆధ్వర్యంలోని అర్చకులు ఆశీర్వచనం జరి పి శ్రీవారి ప్రసాదం అందజేశారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనం జరిపి శ్రీవారి ఆశీస్సులు అందించారు. అదే విధంగా ప్రో కబడ్డీ క్రీడాకారుడు లోకేశ్ శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆయన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డిని కలిసి అభినందనలు అందుకున్నారు. స్థానిక నాయకులు నారాయణ దగ్గరుండి దర్శనం ఏర్పాట్లు చూశారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...