యాదాద్రిలో అన్ని వివాదాస్పద బొమ్మల తొలగింపు


Sat,September 7, 2019 11:27 PM

యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: యాదాద్రి ఆలయ విస్తరణ పనుల్లో ఔటర్ ప్రాకార మండపంలో శిల్పులు అత్యుత్సాహంతో చెక్కగా వివాదంగా మారిన అన్ని బొమ్మలను తొలగించే కార్యక్రమానికి శిల్పులు శ్రీకారం పలికారు. వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు నుంచి అందిన ఆదేశం మేరకు వివాదాస్పదమైన జవహర్‌లాల్, రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీ పలు పాత, నూతన వాహనాలు తదితర వివాదాస్పద బొమ్మలను తొలగించే పనులను శనివారం సాయంత్రం శిల్పులు ప్రారంభించారు. రెండు మూడు గంటల్లో వాటిని తొలగించే పనులు పూర్తి చేయనున్నారు. మీడియాను అనుమతించకుండా బాలపాద స్తంభాలపై గల వివాదాస్పద గుర్తులను క్లీన్ చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...