వేణుకొండల్ మృతి సాంస్కృతిక సమాజానికి తీరని లోటు


Sat,September 7, 2019 11:27 PM

భువనగిరి, నమస్తే తెలంగాణ : తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారుడు వేణుకొండల్ మృతి సాంస్కృతిక సమాజానికి తీరని లోటని కలెక్టర్ అనితారామచంద్రన్ అన్నారు. జిల్లా సాంస్కృతిక సారధి కళలాఆకారుడిగా పనిచేస్తూ వేణుకొండలల్ అకాల మరణం పొందడం పట్ల రాష్ట్రస్థాయి సాంస్కృతిక సారధి కళాకారులు 495మంది ఒక్కొక్కరు రూ.1000చొప్పున తమ వేతనం నుంచి మినహాయించుకుని రూ, 4లక్షల 95వేల చెక్కు ను కలెక్టర్ చేతుల మీదుగా వేణుకొండల్ కుటుంబ సభ్యులకు శనివారం స్థానిక పశుసంవర్ధక శాఖ సమావేశ మందిరంలో అందజేసి మాట్లాడారు.తెలంగాణ మలి దశ ఉద్యమం లో తనదైన రీతిలో పాటలతో ప్రజలను చైతన్యపరిచిన వేణుకొండల్ అకాల మృతి ఈప్రాం త ప్రజలను కలచి వేసిందన్నారు.

వేణుకొండల్ ఆశయాల సాధనలకు అందరూ పాటుపడాలన్నారు. తోటి కళాకారుడి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఆలోచనతో కళాకారులు ముం దుకురావడం అభినందనీయమని కళాకారులను కలెక్టర్ అభినందించారు. అంతకు ముందు కలెక్టర్ వేనుకొండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక సారధి కళలాకారుల అధ్యక్షులు అభినయ శ్రీనివాస్, కళాకారులు కొడారి శ్రీను, అంబటి వెంకన్న, ప్రకాశ్, దేవెందర్, పుష్ప, సందీప్, ప్రసాద్, దేవత, సుధాకర్, డాక్టర్ పోరెడ్డి రంగయ్య, డీపీఆర్‌వో జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.

23
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...