మత్స్యకారుల అభివృద్ధికి కృషి


Sat,September 7, 2019 11:26 PM

బీబీనగర్ : మత్స్యకారుల అభివృద్ధికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని వెంకిర్యాల సర్పంచ్ అరిగె సుదర్శన్ అన్నారు. ప్రభుత్వం వంద శాతం రాయితీపై సరఫరా చేసిన చేపపిల్లను వెంకిర్యాల గ్రామంలోని ఈదురు చెరువులో శనివారం వదిలారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామానికి 2.30 లక్షల చేప పిల్లలు విడుదల చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గండు వసంతాబస్వయ్య, ఉపసర్పంచ్ వెంకటేశ్, వార్డు సభ్యులు భరత్, మల్లేశ్, ముదిరాజ్ సంఘం నాయకులు శంకరయ్య, లక్షయ్య, జహంగీర్, అంజయ్య, నరేశ్, నవీన్, శివరాజ తదితరులు పాల్గొన్నారు

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...