గురువులే సమాజానికి ఆదర్శం


Fri,September 6, 2019 11:41 PM

-ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలి
-అంకితభావంతో పనిచేసి విద్యార్థులను తీర్చిదిద్దాలి..
-ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని చదువుల్లో విద్యార్థులు రాణించాలి
-జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి

బొమ్మలరామారం : అజ్ఞాన చీకటిని తొలిగించి విజ్ఞాన్ని పంచే గురువులే నేటి సమాజానికి ఆదర్శమని యాదాద్రిభువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఓంశివ ఫంక్షన్‌హాల్‌లో భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపలి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకొని నిర్వహించినమండల ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ..ప్రభుత్వ పాఠశాలల బలోపతానికి ప్రతి ఒక్క రూ తోడ్పాటునందించాలన్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి అందుకు అనుగుణంగా తీర్చిదిద్దే మ హోన్నత స్థానంలో ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. గురువు తోడ్పాటు లేకుండా ఏమీ సాధించలేమన్నారు. సమాజంలో ఆదర్శవంతమైన జీవితానికి గురువులే నాంది అన్నారు. ఉపాధ్యాయ వృత్తికి అందించిన సేవలకు గౌరవంగా భారత రాష్ట్రపతి స్థాయిని అందుకొని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

అంకితభావంతో పనిచేసి విద్యార్థులను అన్ని రంగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దాలన్నారు. సీఎం కేసీఆర్ విద్యార్థుల సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారెందరో నేడు ఉన్నత స్థాయి రంగాల్లో రాణిస్తున్నారన్నారు. దాతలు,స్వచ్ఛంద సం స్థలు, గ్రామస్తుల సహాకారంతో పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలన్నారు.విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు ఉపాధ్యాయులు చేస్తున్న సేవలు మరువలేనివన్నారు. అనంతరం మండల ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన.. ఈ.వెంకటేశ్వర్లు మేడిపల్లి, జి.వెంకటరమణారావు జలాల్‌పూర్, టి.శ్రీకాం త్ మర్యాల, వి.దినేశ్‌కుమార్ నాగినేనిపల్లి, ఎన్ జయలక్ష్మి చీకటిమామిడి, ఎం.స్వామి నాగినేనిపల్లి, ఎం.రూప ఆదర్శ పాఠశాల, ఆర్.శ్రీలత కేజీబీవీ,ఆర్. వెంకటేశ్వర్‌రాజు మర్యాల, జి.క్రిష్ణారెడ్డి కెకెతండ, జి.వెంకట్‌రెడ్డి చం దుతండ, టి.రవీందర్ మేడిపల్లి, జి.సాగర్‌రెడ్డి పిజితండ, పి.జ్యోతి బోయిన్‌పల్లిలను పూలమాలలు, శాలువాలతో సన్మానించి ప్రశంసా పత్రాలతోకూడిన అవార్డులను ప్రదానం చేశారు.

మండల స్థాయిలో అవార్డు పొందిన ఉపాధ్యాయులు రానున్న రోజుల్లో మరింతగా పనిచేస్తూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులను పొందాలని ఆశించారు. కార్యక్రమంలో ఎంపీపీ చిమ్ముల సుధీర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ గొడుగు శోభాచంద్రమౌళి, మాజీ ఎంపీపీ బొల్లంపల్లి తిరుపతిరెడ్డి, ఎంపీడీవో సరిత, తహసీల్థార్ పద్మసుందరి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు పొలగౌని వెంకటేశ్‌గౌడ్, మాజీ అధ్యక్షుడు గూదె బాల్‌నర్సింహ్మ, మండల టీఆర్‌ఎస్ ప్రధానకార్యదర్శి రామిడి రాంరెడ్డి, ఎస్టీ సెల్ అధ్యక్షుడు ధీరావత్ రాజన్‌నాయక్, ఎస్సీ సెల్ మైలారం రామకృష్ణ, నాయకులు గోలిపల్లి పోశంరెడ్డి, ఉడుతల రమేశ్‌గౌడ్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పలు పాఠశాలల ఉపాధ్యాయులు, సర్పంచ్, ఎంపీటీసీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...