వ్యవసాయంలో మహిళలదే ప్రధాన భూమిక


Fri,September 6, 2019 11:39 PM

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ : వ్యవసాయంలో మహిళలే ప్రధాన భూమిక పోషిస్తారని, సాంకేతిక పరిజ్ఞానం అందుపుచ్చుకుని మహిళలు వ్యవసాయంలో ముందు వరుసలో ఉండాలని జిల్లా వ్యవసాయాధికారి అనూరాధ అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలోని రెడ్డి సంక్షేమ భవనంలో అజీవా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ద్వితీయ వార్షిక మహసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లడారు.

మహి ళా రైతు ఉత్పత్తిదారులను పెంపొందించేందు కు అజీ వా సంస్థ చేస్తున్న కృషి భేష్‌గా ఉందన్నారు. జడ్పీటీసీ తోటకూరి అనూరాధబీరయ్య మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మహిళలు సాం కేతిక వ్యవసాయం పద్ధ్దతులను పాటించాలని సూచించా రు. చిరుధాన్యాలతోపాటు సేంద్రియ పద్ధతిలో వ్యవసా యం చేస్తే లాభాలు అధికంగా రావడంతో పాటు ఖర్చులు సైతం తగ్గించుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట మండలంలోని 7 గ్రామాలు అజీవా సంస్థ మహిళా సభ్యులు పాల్గొనగా ఏడాది కాలం లో అజీవ సం స్థ చేసిన ఉత్పత్తులు, రాబోయే కాలంలో అనుసరించాల్సిన విధానాలపై చర్చించుకున్నారు. అజీవా సంస్థలో సభ్యులుగా ఉన్న మహిళా రైతులకు వాటాధనం సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో హార్టికల్చర్ మండ ల అధికారి సౌమ్య, మహిళా రైతులు పాల్గొన్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...