గ్రామాల రూపురేఖలు మారాలి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య


Fri,September 6, 2019 11:38 PM

రామన్నపేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రణాళికతో గ్రామాల రూపు రేఖలు మారాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని బోగారం గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మొదటిరోజు గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సందేశాన్ని గ్రామ ప్రత్యేకాధికారి కృష్ణ చదివి వినిపించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాలకు చోటులేకుండా గ్రామాల అభివృద్ధ్ది కోసం కృషి చేయాలన్నారు. సర్పంచ్ పద్మారమేశ్, కార్యదర్శి యాదగిరి, ఎంపీటీసీలు పద్మ, మహేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు భిక్షంరెడ్డి, నాయకులు దుర్గయ్య, శ్రీనివాస్, విజయ్‌కుమార్, పృథ్వీరాజ్, కోఆప్షన్ సభ్యులు ఎండీ అమీర్, కూనూరు శ్రీనివాస్, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...