గ్రామాలాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి


Fri,September 6, 2019 11:38 PM

-తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్
అడ్డగూడూరు : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో గ్రామాలాభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. మండలంలోని బొడ్డుగూడెంలో శుక్రవారం నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. 30 రోజుల ప్రణాళికతో గ్రామంలోని ప్రతి సమస్య తీరుతుందన్నారు. గ్రామప్రజలు పట్టుదలతో అధికారుల సహాయంతో గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలన్నారు. గ్రామంలో పాడుబడ్డ బావులను పూడ్చివేయాలన్నారు. మొక్కలను నాటాలన్నారు.

మురుగు కాల్వలను శుభ్రం చేయాలన్నారు. 30 రోజుల ప్రణాళిక అమలులో అధికారులు, ప్రజాప్రతినిధులు అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. సర్పంచ్ రజిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీపీ దర్శనాల అంజయ్య, జడ్పీటీసీ జ్యోతి, ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఎంపీడీవో చంద్రమౌళి, తహసీల్దార్ సలీమొద్దీన్, రైతు సమన్వయ సమితి జిల్లా కమిటీ సభ్యుడు కొమ్మిడి ప్ర

23
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...