పల్లెలు ప్రగతిబాట పట్టాలె


Fri,September 6, 2019 11:37 PM

వలిగొండ : ప్రతి పల్లె ప్రగతిబాట పట్టాలని, అందుకోసమే సీఎం కేసీఆర్ 30 రోజుల కార్యాచరణ ప్రణాళికకు శ్రీకారం చుట్టారని జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని వర్కట్‌పల్లి, జాలుకాల్వ గ్రామాల్లో నిర్వహించిన కార్యాచరణ ప్రణళికలో మొదటిరోజు సభకు ఆయన కలెక్టర్ అనితారామచంద్రన్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా గ్రామాల అభివృద్ధిలో పాలుపంచుకోవాలన్నారు. గ్రామ సమస్యలపై గ్రామసభను నిర్వహించి ఐక్యతతో ప్రజలే నాయకులై ముందుకొచ్చి పరిష్కరించుకోవాలన్నారు. గ్రామాల అభివృద్ధికి కలిసి కట్టుగా కృషి చేయాలని కోరారు. కలెక్టర్ అనితారామచంద్రన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి గ్రామాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారన్నారు. కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. మురుగు కాల్వలు, డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలన్నారు. అంతర్గత రోడ్లను మెరుగపర్చుకోవాలన్నారు.

శ్మశానవాటికలు, డంపింగ్‌యార్డ్‌ల కోసం భూసేకరణ చేసుకోవాలని సూచించారు. రూ.10 లక్షల రివార్డును అందుకునే విధంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి కృష్ణారెడ్డి మాట్లాడుతూ మొక్కలను విరివిగా నాటాలన్నారు. అనంతరం వర్కట్‌పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో మొక్కలను నాటారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వాకిటి పద్మారెడ్డి, వైస్ ఎంపీపీ ఉమా, సర్పంచ్ శేఖర్, సందీప్, ఎంపీడీవో వెంకటమ్మ, రైతు సమన్వయ సమితి కన్వీనర్ మమత, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు పైళ్ల రాజవర్ధన్‌రెడ్డి, వెంకన్న, పాండరి, శ్రీనివాస్, శివయ్య, అరవింద్‌రెడ్డి, స్పెషల్ ఆఫీసర్స్ ఏఈవో నమిత, పీఆర్‌ఏఈ సుగుణాకర్‌రావు, మాద శంకర్‌గౌడ్, అయిటిపాముల సత్యనారాయణ, కొమిరెల్లి బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

23
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...