టీఆర్‌ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎన్నిక


Thu,September 5, 2019 11:54 PM

భువనగిరి, నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎన్నిక గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్ మండల ఎన్నికల ఇన్‌చార్జీ ఎరుకల సుధాకర్‌గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సం దర్భంగా టీఆర్‌ఎస్ గ్రామశాఖల అధ్యక్షుల అభిప్రాయ సేకరణ నిర్వహించి టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడిగా తుక్కాపురం గ్రామానికి చెం దిన టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు జనగాం పాండును, ప్రధాన కార్యదర్శిగా వడాఆయిగూడెం మాజీ ఉపసర్పంచ్ టీఆఆర్‌ఎస్ నాయకుడు నీల ఓంప్రకాశ్‌గౌడ్‌లను ఎన్నిక చేసినట్లు తెలిపారు.

నూతన మండల పార్టీ అధ్యక్ష, ప్రధా న కార్యదర్శులుగా ఎన్నికైన జనగాం పాండు, నీల ఓంప్రకాశ్‌గౌడ్‌లను భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్‌గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ కొలుపుల అమరేందర్, ఎంపీపీ నరాల నిర్మలవెంకటస్వామి, జడ్పీటీసీ సభ్యులు సుబ్బూరు బీరుమల్లయ్య, పీఏసీఎస్ చైర్మన్ ఎడ్ల సత్తిరెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు ఎడ్ల రాజిరెడ్డి, మాజీ సర్పంచ్‌ల ఫోరం డివిజన్ అధ్యక్షుడు అబ్బగాని వెంకట్‌గౌడ్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ కంచి మల్లయ్య, టీఆర్‌ఎస్ నాయకులు చందుపట్ల రాజేశ్వర్‌రావు, సిలువేరు యేసు, పుట్ట వీరేశ్‌యాదవ్, కాటిక జంగయ్య. వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచ్‌లు, టీఆర్‌ఎస్ గ్రామశాఖల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...