జిల్లా ఉత్తమ అవార్డు గ్రహీత విద్యాధర్‌రెడ్డికి సన్మానం


Thu,September 5, 2019 11:53 PM

సంస్థాన్‌నారాయణపురం : మండల పరిధిలోని సర్వేల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు విద్యాధర్‌రెడ్డికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ప్రదానం చేశారు. గురువారం గురుపుజోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో విద్యాధర్‌రెడ్డికి సన్మానం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సర్వేల్ పాఠశాలను ఆదర్శంగా నిలిపేందుకు తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. మెళకువలతో కూడిన విద్యాబోధనకు కృషి చేస్తున్నారని పలువురు ఆయనను అభినందించారు. తనకు ఉత్తమ అవార్డును ప్రదానం చేసిన ప్రభుత్వానికి, అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలేరు, భువనగిరి ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పైళ్ల శేఖర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డి, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, విద్యాధికారి రోహిణి, తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...