క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలి


Thu,September 5, 2019 11:53 PM

మోత్కూరు : విద్యార్థులు క్రమశిక్షణతోనే ఇంటర్మిడియట్ విద్యను అభ్యసించాలని ఇంటర్మీడియట్ నోడల్ యాదాద్రి భువనగరి జిల్లా అధికారిని కె.రమణి అన్నారు. గురువారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ప్రేషర్స్ డే కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. విద్యార్థి దశలోనే ఇంటర్మిడియట్ కీలకమని రంగుల ప్రపంచానికి ఆకర్శితులై జీవితాలను బుగ్గిపాలు చేసుకోవద్దన్నారు. ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్తే ఏలాంటి విజయమైన సాధ్యమవుతుందన్నారు. రాబోయే వార్షిక పరీక్షలను ఇప్పటి నుంచి చక్కటి ప్రణాళికతో ఇష్టపడి, కష్టపడి చదివి ఇటు కళాశాలకు అటు కన్న తల్లిదండ్రుల ఆశయాలను నేరవేర్చేందుకు విద్యార్థ్ధులు కృషి చేయాలని కోరారు.

సమావేశానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ రాంపాక అవిలయ్య మాట్లాడుతూ.. విద్య విజ్ఞానం యోక్క గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. సమావేశానికి ముందు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే ఇటీవల జరిగిన 15ఆగస్టును పురస్కరించుకొని నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు బహూమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కడారు నర్సింహ్మరెడ్డి ఎం .పరువురాములు, బి .వెంకట్‌రెడ్డి, బి. పురుషోత్తంరెడ్డి, సతీశ్, జి. సైదులు, కె.శ్రీశైలం, డి. మంజూల, భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...