పార్టీ పటిష్టతకు గ్రామ శాఖలే కీలకం


Sun,August 25, 2019 12:11 AM

భూదాన్‌పోచంపల్లి : పార్టీ పటిష్టతకు గ్రామ శాఖలే కీలకమని, అవి పటిష్టంగా ఉంటేనే పార్టీ మనుగడ సాగించగలదని ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పాటి సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో మండల పరిధిలోని దేశ్‌ముకి, పెద్దగూడెం, పెద్దరావులపల్లి టీఆర్‌ఎస్ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాల్గొని మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన అన్ని ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించడానికి కార్యకర్తల కృషి కారణమన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా కార్యకర్తలు గ్రామ శాఖలు పటిష్టంగా పని చేయాలని సూచించారు. టీఆర్‌ఎస్ కార్యకర్త సంక్షేమంపై కేటీఆర్ దృష్టి పెట్టారని తెలిపారు. కార్యకర్తల సంక్షేమానికి పార్టీ పెద్దపీట వేయడానికి సిద్ధంగా ఉందన్నారు. అనంతరం దేశ్‌ముఖి గ్రామ అధ్యక్షుడిగా తోటకూరి శ్రీశైలం, ప్రధాన కార్యదర్శిగా సూర కృష్ణ, పెద్దగూడెం గ్రామ అధ్యక్షుడిగా ఎండీ మఖ్బూల్, ప్రధాన కార్యదర్శిగా పశువుల అంజయ్య, పెద్దరావులపల్లి గ్రామ అధ్యక్షుడిగా సోమారం బాల్‌నర్సింహ, ప్రధాన కార్యదర్శిగా కందాల నర్సింహను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు కందాల భూపాల్‌రెడ్డి, ముత్యాల మహిపాల్‌రెడ్డి, దుర్గం రాజు, దుర్గం నరేశ్, పెద్దగూడెం సర్పంచ్‌లు మన్నె పద్మారెడ్డి, ఎంపీటీసీలు చిల్లర జంగయ్య యాదవ్, మట్ట దర్శన్, ఏనుగు దర్శన్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...