పిలాయిపల్లిలో ఘనంగా కంఠమహేశ్వర స్వామికి బోనాలు


Sun,August 25, 2019 12:07 AM

భూదాన్‌పోచంపల్లి : మండల పరిధిలోని పిలాయిపల్లి గ్రామంలో శనివారం కంఠమహేశ్వర స్వామికి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘంగా బోనాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు మట్టికుండలు తెచ్చి స్వామి వారికి బెల్లం నైవేద్యం వండి బోనాలలో తీసుకెళ్లి సమర్పించారు. ఈ బోనాలను గ్రామంలోని పురవీధులు గుండా డప్పు చప్పుళ్లతోపాటు బ్యాండు వాయిద్యాల మధ్య ఘనంగా ఊరేగించి తీసుకొని వెళ్లారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కంఠమేశ్వరుడికి తీసుకెళ్లే బోనం ఎత్తుకొని స్వామి వారిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు. ఈ కార్యక్రమం లో ఆయనకు ఎంపీటీసీ బందారపు లావణ్య లక్ష్మణ్‌గౌడ్ తోపాటు మాజీ ఎంపీటీసీ రంగ జ్యోతి విశ్వనాథంలు ఘనంగా సత్కరించారు. అదే విధంగా ఎంపీపీ మాడ్గు ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ కోట పుష్పలత మల్లారెడ్డి, వైస్ ఎంపీపీ పాక వెంకటేశం యాదవ్‌తోపాటు టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు అందెల లింగం యాదవ్ , టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పాటి సుధాకర్‌రెడ్డి రైతు సమన్వయ కమిటీ మండల కన్వీనర్ రావుల శేఖర్‌రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు కందాడి భూపాల్‌రెడ్డిలు పాల్గొనగా వారిని కూడా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు బింగి అంజయ్య, ఉపాధ్యక్షుడు బందారపు నర్సింహగౌడ్, నాయకులు ముద్దగోని నర్సింహగౌడ్, రంగ విశ్వనాథ్ గౌడ్, కొం తం సుదర్శన్ గౌడ్, గరిసె వెంకటేశ్ గౌడ్, కాసుల రమేశ్, కొంతం యాదయ్య, బింగి నర్సింహ, బండిగారి నర్సింహ, బందారపు అంజయ్య, మల్లేశ్, డ్యాగల కిష్టయ్య, ప్యాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...