ఘనంగా బోనాల పండుగ


Sun,August 25, 2019 12:06 AM

భువనగిరి, నమస్తేతెలంగాణ : మండలంలోని రాయగిరి, తాజ్‌పూర్, ముత్తిరెడ్డిగూడెం తదితర గ్రామాల్లో శనివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల మహిళలు గ్రామ దేవతలకు బోనాలు సమర్పించేందుకు డప్పుచప్పుళ్ల మధ్య బోనాలతో భారీగా ఊరేగింపుగా తరలివెళ్లి దేవతలకు నైవేధ్యాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వడపర్తి గ్రామ పరిధిలోని ఎస్‌ఆర్ పాఠశాలలో నిర్వహించిన బోనాల వేడుకల్లో భాగంగా విద్యార్థులు పోతురాజుల వేషధారణలో అలరించారు. ఆయా కార్యక్రమాల్లో వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, మహిళలు, భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో పెద్దమ్మతల్లి బోనాలు..
బీబీనగర్ : మండలంలోని కొండమడుగు గ్రామంలో పెద్దమ్మతల్లి బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. బోనాల పండగను పుస్కరించుకొని గ్రామస్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మహిళలు అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల ముందు డప్పుచప్పులు, శివసత్తులు, పోతరాజుల విన్యాసాలు అందరినీ అలరించాయి.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...