చట్ట సభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి


Sun,August 25, 2019 12:06 AM

భువనగిరి, నమస్తేతెలంగాణ : చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు సురుపంగ సుగుణ మాదిగ అన్నారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పసునాది ఉప్పలమ్మ అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళలపై జరుగుతున్న దాడులు, హత్యాచారాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం సుదీర్ఘ పోరాటం చేస్తున్నామని చెప్పారు. మహిళల రక్షణ కోసం మాదిగ మహిళా సమాఖ్య నిరంతరం పోరాడుతుందన్నారు.
ఈ నెల 27న యాదగిరిగుట్టలో జరుగనున్న జిల్లా సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సదస్సుకు మాదిగ మహిళలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొండమడుగు ఆండాలు, సిలువేరు జంగమ్మ, సురుపంగ దుర్గమ్మ, పసునాది నర్సమ్మ, పద్మ పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...