కనీస సౌకర్యాల ఏర్పాటుకు కృషి చేస్తాం


Fri,August 23, 2019 12:24 AM

ఆలేరుటౌన్‌ : పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలో కనీస సౌకర్యాల ఏర్పాటుకు కృషి చేస్తామని ఎంపీపీ గంధమల్ల అశోక్‌, మాజీ ఎమ్మెల్యే, జడ్పీటీసీ డా.కుడుదుల నాగేశ్‌ అన్నారు. గురువారం ఆలేరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను వారు ఆకస్మికంగా తనిఖీ చేసి పాఠశాలలోని కనీస సౌకర్యాలు, ఉపాధ్యాయుల హాజరు రిజస్టర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. శిథిలావస్థకు చేరుకున్న తరగతుల గదులు వర్షాకాలంలో నీరు కారుతున్నాయని తెలిపారు. విద్యార్థుల సంఖ్యకు తగినవిధంగా గదులు లేవన్నారు. తాగడానికి మంచినీరు లేకా తప్పనిసరి పరిస్థితుల్లో రోజుకు 20 క్యాన్ల మంచినీరు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.

ప్రతియేట ఉత్తమర్యాంకులు సాధిస్తున్న ఈ పాఠశాలలో కనీససౌకర్యాలు కల్పిస్తే మరింత మంది విద్యార్థులు వస్తారని చేరేందుకు అవకాశం ఉంటుందన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే, ఆలేరు జడ్పీటీసీ డా.కుడుదుల నాగేశ్‌ మాట్లాడుతూ.. తప్పనిసరిగా పాఠశాలలో మౌలిక సౌకర్యాల ఏర్పాటుకు కృషి చేస్తానని, డిజిటల్‌ క్లాసులతో కూడిన ఆధునిక తరగతి గదుల నిర్మాణానికి కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పాఠశాలలో కావల్సిన సౌకర్యాల గురించి ఉపాధ్యాయులు వారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ప్రశాంత్‌, ఎంపీటీసీ ఎండీ గయాస్‌, స్కూల్‌ ఇన్‌చార్జి శ్యాంసుందరి, ఉపాధ్యాయులు మంద సోమరాజు, యోగేశ్వరావు, ఎండీ ఖలీల్‌, శేఖర్‌, మురళి, స్వర్ణలత, కవిత ఉన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...