స్వచ్ఛభారత్‌ పనుల సందర్శన


Fri,August 23, 2019 12:20 AM

మోటకొండూర్‌ : మండలంలోని అమ్మనబోలు గ్రామంలో కేం ద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న స్వచ్ఛభారత్‌ పనులను గురువారం స్వచ్ఛభారత్‌ కేంద్ర కమిటీ సభ్యులు త్రివే ణి సందర్శించారు. ఈ సందర్బంగా స్వచ్ఛభారత్‌ మిషన్‌లో భా గం గా సచ్ఛసర్వేక్షణ్‌ గురించి గ్రామంలో అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో వీధుల వెంట నీటి నిల్వ లేకుండా చూడాలని ప్లాస్టిక్‌ రహితంగా గ్రామాన్ని ఉంచాలని మరుగుదొడ్లు నిర్మించుకున్న వారు వాటిని ఉపయోగించుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్థులకు సూచించారు. అనంతరం మండల అధికారులతో గ్రామ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో యాదగిరి, ఈవోపీఆర్డీ వీరస్వామి, గ్రామ సర్పంచ్‌ సిరిపురం నర్మద, ఎంపీటీసీ పోలేపల్లి జ్యోతిలక్ష్మీ, పంచాయతీ సెక్రటరీ అశోక్‌, ఫీల్డ్‌ అఫీసర్‌ రమేశ్‌,వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...