అందరూ సమన్వయంతో పనిచేయాలి


Thu,August 22, 2019 02:26 AM

-జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఉపేందర్‌రెడ్డి
రామన్నపేట : అధికారులు, ప్రజాపతినిధులు సమన్వయంతో పనిచేసి హరితహారం లక్ష్యా న్ని పూర్తి చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎం. ఉపేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగిన హరితహారం సమీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు.మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న శ్మశానవాటికలు, మరుగుదొడ్లు, కిచన్‌ షెడ్‌, క్యాటిల్‌షెడ్‌ గోట్‌షెడ్‌,మ్యాజిక్‌ సోకుపిడ్స్‌ పై సమీక్షించారు. సర్పంచ్‌లు, కార్యదర్శులకు సూచనలు చేశారు. మండలానికి నిర్దేశించిన 12 లక్షల మొక్కలను నూరుశాతం నాటి సంరక్షించాలని కోరారు. వచ్చే ఏడాది నుంచి గ్రామాల్లోని నర్సరీలను ఈజీఎస్‌ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. స్థానిక అవసరాల మెరకే మొక్కలను పెంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జలంధర్‌రెడ్డి, ఎంపీపీ కన్నెబోయిన జ్యోతిబలరాం, వైస్‌ ఎంపీపీ నాగటి ఉపేందర్‌, ఎంఈవో దుర్గయ్య, ఏపీవో వెంకన్న, ఈసీ విక్రం, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...