సాహిత్యంతో ఆత్మ ైైస్థెర్యం


Thu,August 22, 2019 02:23 AM

రామన్నపేట : సాహిత్యం ఆత్మ ైస్థెర్యాన్ని పెంపొందిస్తుందని బీసీ కమిషన్‌ సభ్యుడు జూలూరు గౌరీశంకర్‌ ఆన్నారు. బుధవారం మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన విద్యార్థులకు దిశానిర్దేశం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలుగు భాషను చదువటం ద్వారా మన కళలు, సంప్రదాయలు, సంస్కృతి, ఆచార వ్యవహారాలు తెలుస్తాయన్నారు. డిగ్రీ పూర్తి చేయడంతోనే విజయం కాదన్నారు. జీవితమంటే చదువే కాదని, సమాజంపై కూడా అవగాహన పెంచుకోవాలన్నారు. కోల్పోయిన క్షణాలను తిరిగి తీసుకురాలేమని గుర్తించాలన్నారు.
దిన పత్రికలు చదువటం అలవాటు చేసుకోవాలన్నారు. లక్ష్యాన్ని ఎంచుకొని విద్యను అభ్యసించాలన్నారు. గురుకుల పాఠశాలల్లో కార్పొరేట్‌స్థాయి విద్య అందుతుందన్నారు. ఇది మార్పుకు సంకేతమన్నారు. పిల్లల కోసం తల్లిదండ్రులు శ్రమిస్తూ వారిపై ఎన్నో కలలు కంటున్నారన్నారు. తల్లిదండ్రులకు పిల్లలు ఇచ్చే కానుక జీవితంలో ఉన్నత స్థితిలో స్థిరపడటమేననన్నారు. కళాశాల విస్తృత భావాల విశాల వేదిక అన్నారు. పుస్తకాలకు రెక్కలు ఉండవన్నారు. వాటిని చదివితే మనకు విజ్ఞానపు రెక్కలొస్తాయన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డా. బెల్లి యాదయ్య, అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆర్డీవో సూరజ్‌కుమార్‌, రాష్ట్ర రిసోర్స్‌ సెంటర్‌ డైరెక్టర్‌ బండి సాయన్న, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి యాదయ్య, తహసీల్దార్‌ బ్రహ్మయ్య, వైస్‌ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఏవో యాదగిరి అధ్యాపకులు ఇందిర, కుమారి, అనిత, నరేశ్‌, యాదగిరి, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...