సీసీ రోడ్డు పనులు ప్రారంభం


Thu,August 22, 2019 02:10 AM

భూదాన్‌పోచంపల్లి : మండల పరిధిలోని కనుముక్కులలో హెచ్‌ఎండీఏ నిధులు రూ.10 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను వైస్‌ ఎంపీపీ పాక వెంకటేశంయాదవ్‌, సర్పంచ్‌ కోట అంజిరెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్‌ ఎంపీపీ పాక వెంకటేశం యాదవ్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి కృషితో ఇప్పటికే అనేక గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగునీటి కాల్వల నిర్మాణం పూర్తి చేసుకున్నామన్నారు. హెచ్‌ఎండీఏ నిధులతో మరిన్ని పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. కనుముక్కులలో ఇప్పటివరకు రూ.1.5 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉంటానన్నారు. కార్యక్రమంలో చౌటుప్పల్‌ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ పాక జంగయ్యయాదవ్‌, ఉపసర్పంచ్‌ పాక నర్సింహయాదవ్‌, వెంకటేశం, కోట చంద్రారెడ్డి, భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...