‘టీఆర్‌ఎస్‌ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి’


Wed,August 21, 2019 12:05 AM

మోత్కూరు : గ్రామ స్థాయి నుంచి టీఆర్‌ఎస్‌ బలోపేతంకు ప్రతి కార్యకర్త ఐక్యంగా పని చేయాలని టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కొణతం యాకుబ్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ గ్రామ శాఖల నూతన కార్యవర్గాల ఎన్నికల కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలోని పాలడుగు గ్రామంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.సీఎం కేసీఆర్‌ న్యాయకత్వంలోనే పల్లేలు అభివృద్ధి సాధించనున్నాయన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగమయ్యే లా ప్రతి కార్యకర్త పని చేయాలన్నారు.ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షుడుగా బొడిగే రమేశ్‌, ఉపాధ్యక్షుడు శివరాత్రి నర్సిం హ్మ, ప్రధాన కార్యదర్శిగా మోత్కూరు చిటుకలయ్య, సహయ కార్యదర్శి గుంటోజు శేఖర్‌, కోశాధికారి ముప్పడి మల్లేశ్‌లను ఎన్నుకున్నారు.

దత్తప్పగూడెంలో...
మండలంలోని దత్తప్పగూడెం గ్రామంలో మండలాధ్యక్షుడు కొణతం యాకుబ్‌రెడ్డి సమక్షంలో గ్రామ శాఖ అధ్యక్షుడిగా కన్నెబోయిన సత్తయ్య ఉపాధ్యక్షుడిగా ముక్కేర్ల నర్సింహ్మ, ప్రధాన కార్యదర్శి గనగాని రమేశ్‌, సహయ కార్యదర్శి బలిక భిక్షం, కోశాధికారి రహింపాషాలను ఎన్నుకున్నారు.

పొడిచేడులో..
మండలంలోని పొడిచేడు గ్రామంలో మండలాధ్యక్షుడు కొణతం యాకుబ్‌రెడ్డి సమక్షంలో గ్రామ శాఖ అధ్యక్షుడిగా బోయపల్లి సైదులు, ఉపాధ్యక్షుడిగా నర్రె నర్సయ్య, ప్రధాన కార్యదర్శి జిట్ట లక్ష్మయ్య, సహయ కార్యదర్శి దొంతర బోయిన శ్రీను, కోశాధికారిగా బుంగ రమేశ్‌, సోలిపురం కృష్ణారెడ్డి, ఓర్సు నాగులు, ఏనుగు మత్స్యగిరి, జిట్ట కృష్ణ, ఖమ్మం పాటి శారదలను కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పొన్నేబోయిన రమేశ్‌, సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు నిమ్మల వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు కాసోజు శంకరమ్మ, సత్యనారాయణచౌదరి, సర్పంచి పేలపుడి మధు, ఉప సర్పంచి కప్పె వెంకటేశ్‌, నాయకులు దెందే యాదగిరి, అంబటి మహేశ్‌, మల్లం లక్ష్మి, బుంగ పరమేశ్‌, జిట్ట ఈరమ్మ, సుగుణమ్మ, బండ వనజ, సామకూర వనజ, మల్లం అనిత-సైదులు తదితరులు పాల్గొన్నారు.

రాగిబావిలో...
మండలంలోని రాగిబావి గ్రామంలో నూతన గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పసునూరి సత్తిరెడ్డి, ఉపాధ్యక్షుడిగా బాసాని నర్సింహ్మ, ప్రధాన కార్యదర్శి రాంపక మల్లేశం,సహయ కార్యదర్శిగుంటోజు శ్రీను, కోశాధికారిపెసరు నర్సిరెడ్డిలను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు జంగ శ్రీను, కొత్తపల్లి వెంకటేశ్వర్లు, గ్రామ సర్పంచి రాంపాక నాగయ్య, నాయకులు కక్కిరేణి వెంకన్న, నాయకులు రాంపక నర్సింహ్మ, పెసరు అశోక్‌రెడ్డి, కడారు సులోచన, రాంపాక కరుణాకర్‌ పాల్గొన్నారు.

దాచారంలో...
మండలంలోని దాచారం గ్రామ శాఖ అధ్యక్షుడిగా కడమంచి వస్తాద్‌, ఉపాధ్యక్షుడిగా మాతంగి మల్లయ్య, ప్రధాన కార్యదర్శి బీమనబోయిన చిన్న కోమరయ్య, కోశాధికారి జినుకల యాదగిరి, కార్యదర్శి ఆకుల భిక్షం, కార్యవర్గ సభ్యులుగా ఆకుల అంజయ్య, కడమంచి ఫక్కిర్‌, గోలి భిక్షం, జాల అశోక్‌లను ఎన్నుకున్నారు. కార్యక్రమంలోఎన్నికల పరిశీలకులు గోరుపల్లి సంతోష్‌రెడ్డి, బొడ్డుపల్లి కల్యాణ్‌చక్రవర్తి, సూరారం యాదగిరి, సర్పంచి అండెం రజిత, నాయకులు రచ్చ లక్ష్మీనర్సింహ్మరెడ్డి, అండెం రాజిరెడ్డి, సాదుల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

సదర్శాపురం..
మండలంలోని సదదర్శాపురం టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా దొండ నర్సయ్య, కార్యదర్శి పర్రెపాటి యాదయ్య, ఉపాధ్యక్షుడిగా లగ్గాని రమేశ్‌లను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు గోరుపల్లి సంతోష్‌రెడ్డి, బొడ్డుపల్లి కల్యాణ్‌చక్రవర్తి, నాయకులు పాల్గొన్నారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles