రూ.91500లకు పశువుల సంత,తైబజారు, కబేళా వేలం


Mon,August 19, 2019 11:26 PM

వలిగొండ : పట్టణ గ్రామంచాయతీ పరిధిలోని పశువుల సంత, తైబజారు, కబేళాలను ఒక ఏడాదికి బహిరంగ వేలం సోమవారం నిర్వహించారు. సర్పంచ్ బోళ్ల లలిత అధ్యక్షతన జరిగిన ఈ వేలంలో నలుగురు పాల్గొనగా.. పట్టణానికి చెందిన పబ్బు మల్లయ్య రూ.91500లకు దక్కించుకున్నారు. ఈ వేలం పాటను ఈవోఆర్‌డీ పద్మావతి సమక్షంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు కుందారపు యశోద, పల్లెర్ల భాగ్యమ్మ, ఉప సర్పంచ్ మైసోళ్ల మత్స్యగిరి, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, వార్డు సభ్యులు మహ్మద్ ఖుర్షీద్, డోగిపర్తి సంతోశ్, ఈతాప నర్సింహ, పబ్బు సురేందర్, ఎమ్మె శేఖర్, ఎల్లంకి నాగరాజు, బుంగమట్ల సుధాకర్, పబ్బు లక్ష్మయ్య, కూర శ్రీనివాస్, బచ్చు శ్రీనివాస్, పోలేపాక జానకిరాములు, కొండూరి వెంకటేశం, కాసుల వెంకన్న పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...