ఘనంగా బోనాల పండుగ


Sun,July 21, 2019 11:48 PM

చౌటుప్పల్ రూరల్ : మండల పరిధిలోని దండుమల్కాపురంలో శ్రీ ఆందోళ్ మైసమ్మ అమ్మవారి 14వ బోనాల ఉత్సవాలు ఆదివారం రెండోరోజు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో చిట్టెడి వెంకట్‌రెడ్డి.. ఎంపీకి అమ్మవారి జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ అమ్మవారి దయతో వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలు పండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి బోనాలు, చండీహోమం, అన్నదానం, శ్రీ ఆందోళ్ మైసమ్మ, ఉప్పలమ్మ, ఎల్లమ్మ అమ్మవార్ల ఉత్సవ విగ్రహాల గ్రామ సేవ రథోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్ ఎలువర్తి యాదగిరి, ఎంపీటీసీ చిట్టెంపల్లి శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ మల్కాజిగిరి కృష్ణా, వార్డు సభ్యులు అశ్విన్‌రెడ్డి, బల్వంత్‌రెడ్డి, నాయకులు ఉబ్బు వెంకటయ్య, రామస్వామి లచ్చిరెడ్డి, అశోక్, దర్శన్, ఆలయ అర్చకులు వల్లూరి శివప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

భక్తులతో కిటకిటలాడిన ఆలయం...
భక్తుల రద్దీతో ఆలయం కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అమ్మవారికి బోనాల నైవేధ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

నేటి పూజలు..
నేడు ఆలయంలో అమ్మవారికి గణపతి పూజ, సామూహిక కుంకుమార్చనలు, పూర్ణాహుతి హోమం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈ కార్యక్రమాలు చేయనున్నారు.

ఘనంగా ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర
భూదాన్‌పోచంపల్లి : మండల పరిధిలోని గౌస్‌కొండ గ్రామంలో ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతరను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆడపడుచులు అమ్మవారికి మట్టి కుండల్లో నైవేధ్యం వండి అమ్మవారికి సమర్పించారు. డప్పుచప్పుల్లతో ఊరేగింపుగా బోనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పక్కీరు లావణ్య దేవేందర్‌రెడ్డి, ఉప సర్పంచ్ గుర్రం బాల్‌రెడ్డి, వార్డు సభ్యులు గూడురు మల్లారెడ్డి, మునుకుంట్ల దేవయ్య, రేణుక, దేవమ్మ, వాణి, విజలక్ష్మి, నాంపల్లి రవీందర్‌రెడ్డి, నోముల శ్రీనివాస్‌రెడ్డి, గొంగిడి వెంకట్‌రెడ్డి, మునుకుంట్ల శ్రీనివాస్, వాకిటి జంగారెడ్డి పాల్గొన్నారు.

పోచంపల్లిలో పెద్దమ్మతల్లికి బోనాలు..
పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మాధవనగర్ కాలనీలో పెద్దమ్మ తల్లి బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు తడక రమేశ్, దేవాలయం చైర్మన్ గంజి చంద్ర య్య, కార్యదర్శి కల్వకుంట్ల రమేశ్, సత్తయ్య, సుధాకర్, శేఖర్, గోవర్ధన్ పాల్గొన్నారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...