విద్యా విధానంలో మార్పు అవసరం


Sun,July 21, 2019 11:48 PM

రామగిరి : మారుతున్న కాలానికి అనుగుణంగా నాణ్యమైన విద్యను అందించేందుకే విద్యావిధానం మారాల్సిన అవసరం ఉంది... అయితే స్వాతంత్య్రం వచ్చి 70ఏళ్లు గడుస్తున్నప్పటికి నాడు బ్రిటీష్ వాళ్లు ప్రవేశ పెట్టిన విద్యా విధానమే కొనసాగుతుంది.. దేశ, రాష్ర్టాల భవిష్యత్‌కు బాటలు వేసేలా నూతన వి ద్యా విధానం అవసరం అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకం డ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఉమ్మడి నల్లగొండ జిల్లా కేజీ టు పీజీ విద్యా సంస్థల ఆధ్వర్యం లో ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎంఎన్‌ఆర్ గార్డెన్స్‌లో నూతన జాతీయ విద్యావిధానం-2019 డా.కస్తూరి రంగన్ కమిటీ సిఫారస్సులు-సవాళ్లు అనే అంశంపై నిర్వహించిన విద్యా సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, ఆ విద్యా సంస్థల నేతలతో కలిసి మంత్రి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాడు బ్రిటీష్ వాళ్లు గుమస్తాల అవసరాల కోసం విద్యావిధానాన్ని చేసుకున్నారని దాన్నే నేటికీ కొనసాగిస్తుండటం బాధాకరమన్నారు. నేటి కాలానుగుణంగా రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాలను ఆధారంగా చేసుకుని విద్యావిధా నం మార్పునకు శ్రీకారం చుట్టడం హర్షణీయమన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్ధ్దే నిలయాలు విద్యా సంస్థలు అని.. అయితే దేశ భవిష్యత్ అంతా ఈ తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుందన్నారు. ప్రాథమిక దశ నుంచే విద్యార్థులకు పరిశోధన దిశగా విద్యను అందించాలని దీంతోనే ఉన్నత తరగతుల్లోకి విద్యార్థి వెళ్లినప్పుడు విజయం సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వాలను మార్చేది కూడా విద్యనే అని ఆ దిశగా అందరికీ విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యే క విజన్‌తో ముందుకెళ్తున్నారన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించే విధంగా, అవసరాలకు అనుగుణంగా విద్యా విధానాలు, నూతన పాలసీలను చేసుకునే అవకాశం ఉండాలన్నారు.

దీంతోనే ఆ రాష్ట్రంలోని విద్యార్థులకు ఎంతో ఉపయుక్తమవుతుందన్నారు. నూతన పరిశోధనలకు ఊతమిచ్చే విధంగా విద్యావిధానం దిశను మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో చదివిన విద్యార్థి ప్రపంచంలో ఎవరితోనైనా పోటీ పడేలా విద్యా ప్రమాణాలను మెరుగు పరుస్తున్నామని ఆ దిశగా చర్చలు జరుపుతున్నామన్నారు. అయితే ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతామని ఈ విషయంలో ఎవరో అంటున్న ప్రలోభాలకు తావు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర కేజీ టు పీజీ విద్యా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు గింజల రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, నల్లగొండ ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, ఐసీడీఎస్ ఆర్వో మాలే శరణ్యారెడ్డి, ట్రస్మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంట్ల అనంతరెడ్డి, ట్రస్మా నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల అధ్యక్షుడు యానాల ప్రభాకర్‌రెడ్డి, మెరుగు మధు, కొప్పుల భాస్కర్‌రెడ్డి, టీపీజేఎంఎ రాష్ట్ర నాయకులు కాసర్ల వెంకట్‌రెడ్డి, డిగ్రీ అండ్ పీజీ కళాశాలల యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పి.భాస్కర్‌రావు, నాయకులు రఘు, సురేశ్, బంగారు భాస్కర్ ఉ మ్మడి జిల్లా వ్యాప్తంగా కేజీ టు పీజీ విద్యా సంస్థలు నిర్వహిస్తున్న వ్యవహార కర్తలు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...