వరణుడు కరుణించేదెప్పుడో..!


Sun,July 21, 2019 11:47 PM

మోత్కూరు : ఖరీఫ్ సీజన్ మొదలై నెల పదిహేను రోజులు కావస్తున్న ఊరించి ఊకొట్టిన నైరుతి రుతుపవనాలు కనిపించకుండా పోయాయి. గతేడాది జూన్ మొదటి వారంలోనే పచ్చదనం వెల్లివిరిసే గ్రామాల్లో ప్రస్తుతం బీడు భూ ములు, చెరువుల,కుంటలు ఎడారిగా మారాయి. అసలే.. వానాకాలం సీజన్ ఆలస్యమైందని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వర్షాల జాడ లేక పోవడంతో ఏం చేయాలో దిక్కుతోచక వరుణుడి కరుణ కోసం కండ్లు కాయలు కాచేలా అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. గతేడాది జూన్ రెండో వారంలోనే వర్షాలు ఊపందుకొని జిల్లాలో చెరువులు, కుంటలు నీటితో జళకళలాడాయి. ఈ ఏడాది నేటి వరకు చెరువులు, కుంటల్లో చుక్క నీరు లేకపోవడంతో నీటి కోసం మూగ జీవాలు అల్లాడుతున్నాయి. అంతేగాకుండా గ్రామాల్లో భూగర్భ జాలాలు అడుగంటా యి. చుక్క నీరు దొరకడమే గగనమైంది. వారం రోజుల క్రితం కురిసిన కొద్దిపాటి వర్షానికి దుక్కులు దున్నీ పత్తి, కందు విత్తనాలు రైతులు భూములను సిద్ధం చేసుకున్నా రు. మండలంలోని పలు గ్రామాల్లో వర్షాధార పంటలైన పత్తి, కంది, పెసర, నువ్వులు వంటి పంటలను సాగు చేసేవారు. అయితే నేటి వరకు పత్తి విత్తనాలు విత్తకపోవడంతో ఈ ఏడాది పత్తి పండేనా ? అనే అనుమానాలు రైతులను వేధిస్తున్నాయి. వర్షాలు లేకపోవడంతో సాగు పనులు సాగడంలేదు. పంటల సాగు ఆలస్యమైతే పంటలకు చీడ పీడ లు సోకి దిగుబడి తక్కువగా వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చినుకు రాకపోవడంతో ఆకాశం వైపు రైతులు ఎదిరి చూస్తున్నారు. దుర్భిక్ష పరిస్థితులు రాకుండా చూడాలని వరుణ దేవుడిని వేడుకుంటు కప్ప కాముడు, ఆలయాల్లో శివ పూజలు చేసి జలాభిషేకాలను నిర్వహించి మహిళలు ఊరూర చుట్టు కాముడు వంటి ఆటలను ఆడి పాడుతున్నారు. వానాకాలం సీజన్ ఆరంభంలోనే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. జూన్ మొదటి వారంలో రుతుపవనాలు వస్తున్నాయని నిపుణులు ప్రకటించడంతో రైతులు పత్తి నాటడంతో మంచి దిగుబడులు వస్తాయిని చాల మంది రైతులు దుక్కిలోనే పొడి విత్తనాలు విత్తుకున్నారు. దీంతో రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. మరో వారం రోజుల్లో వర్షాలు రాకపోతే అంతే సంగతులని పలువురు రైతులు వాపోతున్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...