పోలింగ్‌స్టేషన్ల తుది జాబితా విడుదల


Sun,July 21, 2019 11:47 PM

మోత్కూరు : మోత్కూరు మున్సిపాలిటీ పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను ఇన్‌చార్జి కమిషనర్ బి సత్యనారాయణ విడుదల చేశారు. ఈ మేరకు ఆదివారం జాబితాను కార్యాలయం నోటీసు బోర్డుపై ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డు కౌన్సిల్ స్థానాలకు గానూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 25 పోలింగ్ స్టేషన్లను కేటాయింపు చేసినట్లు తెలిపారు.1 నుంచి 4వ పోలింగ్ స్టేషన్ల వరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోమోత్కూరు,3 నుంచి 8 వరకు పోలింగ్ స్టేషన్లు కొండగడప ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో, 9వ పోలింగ్ స్టేషన్ ధర్మాపురం ప్రాథమిక పాఠశాల బిల్డింగ్‌లో,10వ పోలింగ్ స్టేషన్ మండల పరిషత్ పాత భవనం మీటింగ్ హాల్‌లో,11,12 పోలింగ్ స్టేషన్లు ప్రాథమిక పాఠశాల బుజిలాపురం, 13వ పోలింగ్ స్టేషన్ ఆరేగూడెం ప్రభుత్వ పాఠశాల,14 పోలింగ్ స్టేషన్ పద్మశాలి కాలనీ మోత్కూరు, 15వ పోలింగ్ స్టేషన్ రాజన్నగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల,16వ పోలింగ్ స్టేషన్ గాంధీనగర్ అంగన్‌వాడీ కేంద్రం మోత్కూరు, 17వ పోలింగ్ స్టేషన్ ఎస్సీ కమ్యూనిటీ హాల్ గాంధీనగర్ మోత్కూరు, 18వ, 19వ పోలింగ్‌స్టేషన్లు ప్రాథమిక పాఠశాల గాంధీనగర్ మోత్కూరు, 20,21పోలింగ్ స్టేషన్లు బీసీ బాలుర హాస్టల్ మోత్కూరు, 22వ 23వ పోలింగ్ స్టేషన్లు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మోత్కూరు, 24వ పోలింగ్‌స్టేషన్ పాత గ్రామ పంచాయతీ కార్యాలయం. 25వ పోలింగ్ స్టేషన్ కొండాపురం లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజన్ దినకర్, పట్టణ ప్లానింగ్ అధికారి వీరస్వామి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...