యాదవులు అవకాశాలను అందిపుచ్చుకోవాలి


Sun,July 21, 2019 11:47 PM

శివాజీనగర్ : యాదవులు అవకాశాన్ని అందిపుచ్చుకుని రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అన్నారు. యాదవుల అభ్యున్నతికి తెలంగాణ సర్కార్ కృషి చేస్తుందని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాకేంద్రంలోని గాంధీనగర్‌లో గల యాదవసంఘం భవనంలో ఆదివారం ఉమ్మడి నల్లగొండ జిల్లా యాదవ సంక్షేమ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఎంపీటీసీలు, జడ్పీటీసీల ఆత్మీయ సమ్మేళన సమావేశం నిర్వహించారు. దీని కి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాను న్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే యాదవ అభ్యర్థుల కు అభినందనలు తెలిపారు.యాదవ ఉద్యోగుల సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు బొబ్బలి గోపాలకృష్ణయాదవ్ మాట్లాడుతూ యాదవులంతా సంఘటితమై రాజకీయంగా సత్తా చాటాలన్నారు. ఈ కార్యక్రమంలో సంక్షే మ సమన్వయ కమిటీ అధ్యక్షుడు పల్లెబోయిన కాశిరామ్‌లు, కోఆర్డినేటర్ దొంగరి యాదగిరి యాదవ్, యా దవ సంఘం నాయకులు చీర పంకజ్‌యాదవ్, చాపల లింగయ్యయాదవ్, నల్లగొండ జిల్లా యాదవ మహిళా సంఘం అధ్యక్షురాలు మామిడి పద్మ ప్రసాద్‌యాదవ్, మునుగోడు ఎంపీపీ కర్నాటి స్వామి, రేణుకాజ్యోతి, జయమ్మ, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్, తరాల బల రాం, నాయకులు లక్ష్మీనారాయణ, పరమేశ్, పిల్లిరామరాజు, శివలింగం, బాలామణి, సరిత పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...