సీఎం కేసీఆర్ పేదలకు పెద్దకొడుకులా ఆసరవుతున్నడు


Sun,July 21, 2019 12:00 AM

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ: ప్రతి పేదింటి పెద్దకొడుకులా సీఎం కేసీఆర్ ఆసరవుతున్నాడని, నిరుపేద వాడు కడుపు నిండా అన్నం తినాలన్నదే టీఆర్‌ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం యాదగిరిగుట్ట పట్టణంలోని ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ ఫంక్షన్‌హాల్‌లో యాదగిరిగుట్ట పట్టణంలో లబ్ధిదారులకు అసరా పింఛన్ల మంజూరు పత్రాలను జేసీ రమేశ్‌తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుపేదల సమస్యలు తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. ఒంటరి మహిళల పింఛన్లను సాధించడంలో తాను చేసిన కృషి నాకు ఎంతగానో సంతృప్తినిచ్చిందని తెలిపారు. జాయింట్ కలెక్టర్ రమేశ్ మాట్లాడుతూ జిల్లాలో జిల్లాలో 90,364 మందికి లబ్ధిదారులకు గానూ నెలకు రూ. 19.52 కోట్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. దీంతో ప్రభుత్వానికి అదనపు భారం రూ. 9.83 కోట్లు పడుతుందన్నారు. మంజూరు పత్రాలను జాగ్రతగా భద్రపరుచుకోవాలని ఆయన లబ్ధిదారులకు సూచించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి మంజూరు పత్రాలు ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది అందజేస్తారని చెప్పారు. ఏవరైన రాని వారుంటే స్థానిక పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో సిబ్బందిని నేరుగా కలిసి విన్నవించుకోవాలని తెలిపారు. సత్వరమే పరిష్కరించి అర్హులైతే నూతన పింఛన్లు అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తోటకూరి అనురాధ బీరయ్య, ఎంపీపీ చీర శ్రీశైలం, ఎంపీడీవో వినోద్‌రెడ్డి, తహసీల్దార్ గణేశ్, ఎంపీటీసీ కాల్నె అయిలయ్య, సర్పంచులు కర్రె వెంకటయ్య, తోటకూరి బీరయ్య, సువర్ణ, బైరగాని చిన్న పుల్లయ్య, పద్మ, దీరావత్ బుజ్జి, భాస్కర్, రాములు , పలు గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...