ప్రతి ముదుసలి ముఖంలో ఆనందం చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం


Sun,July 21, 2019 12:00 AM

మోత్కూరు : తెలంగాణలోని ప్రతి ఇంట్లో ముదుసలి ముఖంలో ఆనందం చూడాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తున్నదని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. శనివారం పట్టణంలోని ఎల్‌ఎన్ ఫంక్షన్‌హాల్‌లో మోత్కూరు, అడ్డగూడూరు మండలాల పరిధిలోని అసరా లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అం దించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మోత్కూరు మండలంలోని 9గ్రామ పంచాయతీల్లోని 2262 మంది లబ్ధిదారులకు రూ.48లక్షల 62 వేల 192, మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని 2089 మంది లబ్ధ్ధిదారులకు రూ.44 లక్షల 95 వేల 424, అడ్డగూడూరు మండల పరిధిలోని 17గ్రామ పంచాయతీల్లోని 8127 మంది లబ్ధ్ధిదారులకు రూ.1 కోటి 74 లక్షల 87 వేల 032లను ప్రతి నెల ప్రభుత్వం అందజేయనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోత్కూరు ఎంపీపీలు దీటి సంధ్యారాణి, దర్శనాల అంజయ్య, జడ్పీటీసీలు గోరుపల్లి శారదసంతోష్‌రెడ్డి, శ్రీరాముల జ్యోతి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మందడి ఉపేందర్‌రెడ్డి, జిల్లా జడ్పీ కో ఆప్షన్ సభ్యులు గుండిగ జోసఫ్, రైతు సమన్వయ కమిటీ కో-ఆర్డినేటర్లు టీ మేఘారెడ్డి, కొండ సొంమల్లు, జిల్లా కమిటీ సభ్యులు కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి, సర్పచుల ఫోరం మండల కన్వీనర్ రాంపాక నాగయ్య, ఇంచార్జి ఎంపీడీఓ బి సత్యనారాయణ, తహసీల్దార్ ఎండీ సలీమొద్దీన్, మండల రైతు సమన్వయ కమిటీ సభ్యులు కొణతం యాకూబ్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...