ఘనంగా ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ జన్మదినం


Sun,July 21, 2019 12:00 AM

సంస్థాన్‌నారాయణపురం: రాష్ట్ర శాసనమండలి సభ్యుడు కర్నె ప్రభాకర్ జన్మదిన వేడుకలు శనివారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. టీఆర్‌ఎస్ గ్రామశాఖ అద్యక్షుడు తెలంగాణ భిక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు స్థానిక సర్పంచు సికిలమెట్ల శ్రీహరి హజరై విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కార్యకర్తల సమక్షంలో కేక్‌కట్‌చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు పాల్గొని తెలంగాణ ఏర్పడిన తర్వాత శాసన మండలి సభ్యుడిగా కొనసాగుతూ గ్రామాన్ని, నియోజవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధ్ది చేస్తు న్న ఎమ్మెల్సీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ వడ్డేపల్లి రాములుసాగర్, మాజీ సర్పంచు ఏర్పుల అంజమ్మ, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుండమల్ల సతీష్‌కుమార్, వార్డు సభ్యురాలు ఎర్రోళ్ల, అందె యాదయ్య, ఉప్పల రాజయ్య, పాలకుర్ల సతీశ్, పల్లె గోపాల్‌రెడ్డి, జక్కల యాదయ్య, ఉప్పల శ్రీనివాస్, రాసాల సత్తయ్య, మెగావత్ నర్శింహ, చింతకింది సుధాకర్, బాబు, ఎర్రోల్ల లింగస్వామి, విడం సాయి, దూసరి వెంకటేశం, వీరమల్ల ఓంకార్,చిలువేరు శేఖర్, బోయిని వెంకటేశం, విద్యాకర్, పేర రమేశ్, బొమ్మగాని రమేశ్ , ప్రశాంత్‌రెడ్డి, నిశాంత్‌రెడ్డి, కిషోర్‌నేత, లింగస్వామి, కొప్పు రామక్రిష్ణ, బాబు తదితరులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...