ఘనంగా ఆందోళ్ మైసమ్మ బోనాలు ప్రారంభం


Sat,July 20, 2019 11:59 PM

చౌటుప్పల్ రూరల్ : మండలపరిధిలోని దండు మల్కాపురం శ్రీ ఆందోళ్‌మైసమ్మ 14 బోనాల ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె. మహేందర్‌కుమార్ ఈ ఉత్సవాలను ముఖ్యఅతిథులుగా పాల్గొని ఆయన చేతులమీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారికి అఖండదీపారాధన, గణపతి పూజ, పుణ్యావాచనం, లలితాసహస్రనామార్చన, ఆరగింపు, హారతి, మంత్రపుష్పం, అన్నదానం, పస్తశతి హోమం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతంర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు మొదటి రోజు కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకొని సుఖ సంతోషాలు కలుగాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో చిట్టెడి వెంకట్‌రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా దేవాదాయశాఖ సూపరింటెండెంట్ రఘునాథ్, ఈవో శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ ఎలువర్తి యాదగిరి, ఎంపీటీసీ చిట్టెంపల్లి శ్రీనివాస రావు, వార్డుసభ్యులు, అర్చక బృందం, పాల్గొన్నారు.

నేటి పూజలు..
ఆదివారం ఆలయంలో బోనాలు, చండీహోమం, అన్నదానకార్యక్రమం, శ్రీ ఆందోళ్‌మైసమ్మ తల్లి, శ్రీ ఉప్పలమ్మ తల్లి, శ్రీ ఎల్లమ్మతల్లి ఉత్సవ విగ్రహాముల గ్రామసేవ రథోత్సవము నిర్వహించనున్నారు.

అసిస్టెంట్ కమిషనర్‌కు సన్మానం..
ఉమ్మడి నల్లగొండ జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.మ హేందర్‌కుమార్‌ను శనివారం మం డలపరిధిలోని ఆందోళ్‌మైసమ్మ దే వాలయంలో ఆలయ ఈవో చిట్టెడి వెంకట్‌రెడ్డి, దేవాలయ అర్చక బృం దం ఘనంగా సన్మానించారు. నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో ఈకార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సన్మానించి అమ్మవారి తీర్థప్రసాదములు అందించారు. ఈకార్యక్రమంలో అర్చకులు వల్లూరి శివప్రసాద్ శర్మ, ఎ.విజయభార్గవాచార్యులు, దేవాలయ సిబ్బంది సత్తిరెడ్డి, ఎం.మల్లేశ్, ఎస్.లావణ్య తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...