గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలి


Fri,July 19, 2019 11:40 PM

భువనగిరి, నమస్తేతెలంగాణ : 2019-20 ఖరీఫ్ పంటకాలానికిగాను ధాన్య సేకరణకు గన్నీ బ్యాంగుల కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ రమేశ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జేసీ తన ఛాంబర్‌లో పౌర సరఫరాల విభాగం అధికారులు, ఎం.ఎల్.ఎస్ పాయింట్ ఇన్‌చార్జీలు, కాంట్రాక్టర్లు, హమాలీ అసోసియేషన్ ప్రతినిధులు, డీలర్ల అసోసియేషన్, స్టేజి-2 కాంట్రాక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీలర్ల వద్ద ఉన్న గన్నీ బ్యాగులను వచ్చే ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు కొరత లేకుండా చూడాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వ వసతి గృహాలకు సన్న బియ్యం బయోమెట్రిక్ ఈ పాస్ విధానం ద్వారా సరఫరా చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ గోపీకృష్ణ, పౌర సరఫరాల జిల్లా అధికారి సంధ్యారాణి, సహాయ అధికారి బ్రహ్మరావు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ కేంద్రాలకు పక్కా భవనాల నిర్మాణానికి చర్యలు : జేసీ
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు పక్కా భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ జి.రమేశ్ తెలిపారు. శుక్రవారం జాయింట్ కలెక్టర్ తన చాంబర్‌లో జిల్లా స్త్రీ సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, సీడీపీవోలు, అంగన్‌వాడీలు, యూనియన్ ప్రతినిధులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అద్దె భవన్‌లో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాలకు వివిధ శాఖల్లో అందుబాటులో ఉన్న నిధులు వెచ్చించి దశలవారీగా పక్కా భవనాలు నిర్మిస్తామని తెలిపారు. అదే విధంగా ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాల్లో కమర్షియల్ పద్ధతిలో సరఫరా అవుతున్న గ్యాస్ సిలిండర్లను పౌర సరఫరాల శాఖతో చర్చించి డొమెస్టిక్‌గా మారుస్తామన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారికి ఆదేశాలు జారీ చేసి రెండేండ్లు నిండిన పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంగన్‌వాడీ టీచర్లకు సరఫరా చేస్తున్న యూనిఫాం నాణ్యమైనదిగా ఉండేందుకు ఆ శాఖ సంచాలకుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. జిల్లా స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలిపారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...