ప్రతి ఇంటి ముందు మరుగుదొడ్డి నిర్మిచుకోవాలి


Fri,July 19, 2019 11:40 PM

సంస్థాన్‌నారాయణపురం: గ్రామంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటిముందు మరుగుదొడ్డిని ఖచ్చితంగా నిర్మించుకోవాలని ఎంపీడీవో జలందర్‌రెడ్డి, సర్పంచు సుర్వి యాదయ్యగౌడ్, కట్టెల భిక్షపతి అన్నారు. మండల పరిధిలోని అల్లందేవిచెర్వు, సర్వేల్ గ్రామాల్లో శుక్రవారం ఉపాధిహామీ పథ కం ద్వారా ఏర్పాటు చేస్తున్న మరుగుదొడ్డి నిర్మాణాలకు ముగ్గుపోసి పనులను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ మురుగుదొడ్డి నిర్మాణం చేసుకోని వారికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను నిలిపివేయాల్సి ఉంటదన్నారు. మురుగుదొడ్డి నిర్మాణం చేసుకొన్న తర్వాత ప్రభుత్వం ఇస్తున్న రూ.12000లను పొందాలని సూచించారు. అలాగే ఇంటిముందు మొక్కలను పెంచి పర్యావరణ కాపాడాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఈసం యాదయ్య, నాయకులు వీరమల్ల వెంకటేశంగౌడ్, ఉపాధి హామీ ఏపీవో ప్రశాంతి, ఈవోపీఆర్డీ మల్సూర్‌నాయక్, పం చాయతీ సెక్రెటరీ అమరెందర్,టీఏ సైదులు, ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేశం, కారోబార్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

వాయిల్లపలిలో చెక్కుల పంపిణీ..
మండల పరిధిలోని వాయిల్లపల్లిలో శుక్రవారం గ్రామసభ నిర్వహించారు.సందర్భంగా సర్పంచు జక్కర్తి పాపయ్య మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యలను సభ్యుల ను అడిగి తెలుసుకొని త్వరలోనే అన్ని పరిష్కారం చేస్తామన్నారు. గ్రామంలో మరుగుదొడ్డి నిర్మించుకున్న వారికి వైస్‌ఎంపీపీ ఆంగోతు రాజు, సర్పంచు జక్కర్తి పాపయ్య చెక్కులు అందజేశారు.కార్యక్రమంలోఉపసర్పంచు జక్కర్తి రాజు, ఎంపీటీసీ దోటి జంగయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...