మహిళా సంఘాల సభ్యులు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి


Fri,July 19, 2019 11:40 PM

భువనగిరి, నమస్తేతెలంగాణ : మహిళా సంఘాల సభ్యులు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి, జడ్పీటీసీ సభ్యులు సుబ్బూరు బీరుమల్లయ్య అన్నారు. శుక్రవారం మండల సమాఖ్య సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. బ్యాంకు ద్వారా అందించే రుణాలతో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టిందని గుర్తు చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ వంటి పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీపీఎం ఆనంద్, ఏపీఎం గంట లింగయ్య, సీసీలు అప్సర్‌బీ, అశోక్, భాస్కర్, అలివేలు, మండల సమాఖ్య అధ్యక్షురాలు సుజాత, అనిత, నిర్మల, వీవోల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...