పాఠశాల సమయాల్లో బస్సులు నడుపాలి


Fri,July 19, 2019 11:39 PM

మోత్కూరు : ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని పలు గ్రామాల్లో పాఠశాలల సమయాల్లో విద్యార్థుల ఇబ్బందులు లేకుండా బస్సులను నడపాలని యాదాద్రి భువనగిరి జిల్లా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కన్వీనర్, దళిత రత్న అవార్డు గ్రహిత యెర్రవెల్లి నర్సయ్య కోరారు. శుక్రవారం నల్లగొండలో ఆర్టీసీ ఆర్‌ఎం వెంకన్నను మర్యాద పూర్వకంగా కలిపి పుష్పగుచ్ఛంను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ఆర్‌ఎం వెంకన్నకు జిల్లాలోని పలు సమస్యలపై చర్చించారు. పేద కుటుంబాలకు చెందిన వారు పాఠశాల సమయాల్లో బస్సులు లేక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ మేరకు ఆర్‌ఎం సానుకూలంగా స్పందించి అన్ని డీపోల మేనేజర్లకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తానని తెలిపారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...