నేడు ఆసరా పింఛన్ల ప్రొసీడింగ్స్ అందజేత


Fri,July 19, 2019 11:39 PM

చౌటుప్పల్, నమస్తేతెలంగాణ/ సంస్థాన్‌నారాయణపురం: లక్కారం జయశ్రీ గార్డెన్స్‌లో శనివారం నిర్వహించనున్న ప్రభుత్వం పెంచిన ఆస రా పింఛన్ల ప్రొసీడింగ్స్‌ను ఉమ్మడి నల్లగొండ అభివృద్ధి ప్రధాత , విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. పెరిగిన వృద్ధ్యాప్య, వికలాంగ, వితంతు పింఛన్ల ప్రొసిడింగ్స్‌ను ఉదయం 10 గంటలకు విద్యాశాఖ మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు, ముఖ్య నాయకులు అధిక సంఖ్యలో వచ్చి మంత్రికి ఘనస్వాగతం పలుకాలని కోరారు. ఇప్పటికే మంత్రి రాక సందర్భంగా ఘనస్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని తెలిపారు.

నేడు మోత్కూరుకు ఎమ్మెల్యే గాదరి కిశోర్..
మోత్కూరు : తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ శనివారం మోత్కూరు మండలంలో పర్యటించనున్నారని ఎంపీడీవో బి సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు.మోత్కూరు మండలంలో 2262,అడ్డగూడూరు మండలంలో 8,127, మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో 20 89 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...