యాదాద్రిలో ప్రత్యేక పూజల కోలాహలం


Fri,July 19, 2019 01:02 AM

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ :యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం లో గురువారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామిఅమ్మవార్లను అభిషేకించారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. ఆలయ మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, నిత్య కల్యాణం జరిగాయి. కొండపైన గల పర్వతవర్థ్ధిని రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలు స్తూ కుంకుమార్చన జరిపారు. ఆలయ పుష్కరిణీ చెంత భక్తులు పుణ్యస్నానం ఆచరించి సంకల్పంలో పాల్గొన్నారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్టమూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన జరిగాయి.

ఘనంగా వ్రత పూజలు...
యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే శ్రీసత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. సామూహిక వ్రతాలు పెద్ద ఎత్తున జరిగాయి. వ్రత పూజల ద్వారా రూ. 11,500ల ఆదాయం సమకూరింది. శ్రీసత్యనారాయణుడిని ఆరాధిస్తూ భక్తి శ్రద్ధ్దలతో పూజలు నిర్వహించారు.

శ్రీవారి ఖజానాకు రూ. ఆదాయం..
శ్రీవారి ఖజానాకు రూ. 4,48,706 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ గీత తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ.32,394,100 రూపాయల టికెట్‌తో రూ. 27,000,కల్యాణకట్ట ద్వారా రూ.11,200, గదులు విచారణ శాఖతో రూ. 23,600, ప్రసాదవిక్రయాలతో రూ.2,43,310, శాశ్వత పూజలతో రూ. 18,000 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.

శ్రీలక్ష్మీనరసింహుని సన్నిధిలో సీనియర్ ఐఏఎస్ అధికారులు
యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ: యాదాద్రిశ్రీలక్ష్మీనరసింహస్వామివారిని సీనియర్ ఐఏఎస్ అధికారులు స్వప్నకుమార్ మొండల్, రాహుల్ రణ్‌బీర్‌సింగ్, గ్రామీణాభివృద్దిశాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగరాజు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించారు. సూపరిండెంట్ వేముల వెంకటేశ్ శ్రీవారి ప్రసాదం అందజేశారు. అర్చకులు ఆశీర్వచనం జరిపారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...