అమెజాన్ పోర్టల్ ద్వారా ఖండాంతరాలకు మార్కెటింగ్


Fri,July 19, 2019 12:58 AM

భూదాన్‌పోచంపల్లి : చేనేత కార్మికులు తాయరు చేస్తున్న పోచంపల్లి ఇక్కత్ వస్ర్తాలను తక్కువ ఖర్చుతో హంగామా లేకుండా ఖండాంతరాలకు మార్కెట్ చేసుకునే అవకాశం ఉన్నదని బెంగుళూరుకు చెందిన అమెజాన్ అసిస్టెంట్ మేనేజర్ నూరుల్ చౌదరి తెలిపారు. గురువారం పోచంపల్లి పట్టణం శ్రీ మార్కండేశ్వరస్వామి దేవాలయంలోని పోచంపల్లి టై అండ్ డై అసోసియేషన్ కమిటీహాలులో భారత ప్రభుత్వం, జౌళి మంత్రిత్వ శాఖ, చేనేత అభివృద్ధి కమిషన్ సౌజన్యంతో మెజాన్ పోర్టల్‌పై అవగాహన కల్పించారు. పోచంపల్లి టై అండ్ డై అసోసియేషన్, చేనేత సేవా కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ఈ సదస్సుకు హాజరైన ఆయన మాట్లాడుతూ నేడు శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందడంతో ప్రపంచం మొత్తం ఆన్‌లైన్ మార్కెట్‌పై మొగ్గు చూపుతుందన్నారు. తక్కువ సమయంలో ఉన్న చోటే మార్కెట్ చేసుకునే అవకాశం అమెజాన్ కల్పిస్తుందన్నారు. చేనేత కార్మికులకు అమెజాన్ పోర్టల్‌లో ఫ్రీగా ఎంట్రీ అందజేస్తున్నామన్నారు. జిల్లా చేనేత జౌళి శాఖ ఏడీ సంపత్ మాట్లాడుతూ ప్రతీ కార్మికుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోచంపల్లి టై అండ్ డై అసోసియేషన్ అధ్యక్షుడు తడక రమేశ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో టెక్స్‌టైల్స్ డిజైనర్ పులుగేంది, చేనేత ఔళి శాఖ జిల్లా ఏవో కళింగారెడ్డి, చేనేత సేవాకేంద్రం ప్రతినిధి శ్రీనివాసులు, పోచంపల్లి టై అండ్ డై అసోసియేషన్ ప్రతినిధులు భారత లవకుమార్, సంగెం చంద్రయ్య, భోగ విష్ణు, పెండెం రఘు,యాదగిరి, సీత గాంధీ, అరవింద్, భారత నాగభూషణ్, చక్రాల నర్సింహ, దయానంద్, నాగేశ్, హరి, తదితరులు ఉన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...