జల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత


Fri,July 19, 2019 12:58 AM

తుర్కపల్లి : జల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని నీతి అయోగ్ సలహాదారుడు అవినాశ్ మిశ్రా, కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ మనీశ్‌కుమార్ అన్నారు. జల శక్తి అభియాన్‌లో భాగంగా గురువారం మండల కేంద్రంతో పాటు తిరుమలాపూర్ గ్రామాలను వారు సందర్శించారు. ఉపాధిహామీ పథకంలో చేపట్టిన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తిరుమలాపూర్‌లో ఊటకుంటలు, మొక్కల పెంపకాన్ని పరిశీలించారు. ఈ ఏడాదిలో చేపట్టనున్న పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నూతనంగా నిర్మించే ఊటకుంటలు ఫారంపాండ్స్ స్థలాలను పరిశీలించారు. ప్రస్తుతం నిర్మించనున్న ఫారంఫాండ్స్, ఊటకుంటలను మూడు నెలల తరువాత మరోసారి వచ్చి పరిశీలిస్తామని తెలిపారు. తుర్కపల్లిలో రైతు ఆనంద్‌కుమార్ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి చిరుధాన్యాల సాగును పరిశీలించారు. తిరుమలాపురంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో తుర్కపల్లి, భువనగిరి, రాజాపేట, గుండాల మండలాల్లో ప్రమాదకర స్థాయిలో భూగర్భజలాలు అడుగంటిపోయాయన్నారు. జిల్లాలో గత 10 సంవత్సరాలుగా వర్షపాతం లోటుగా నమోదయిందన్నారు. ఇంకుడు గుంతలు, చెక్‌డ్యాంలు, నీటి కుంటలు ఫారంఫాండ్‌లను నిర్మించుకోవడం ద్వారా భూగర్భజలాలు పెంపోందించుకోవచ్చు అన్నారు. మొక్కల పెంపకంతో శాశ్వతంగా కరువును దూరం చేసుకోవచ్చు అన్నారు. జలశక్తి అభియాన్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానశాఖ అధికారి సురేశ్‌నాయక్, ఏపీడీ శ్యామల, అటవిశాఖ అధికారి షాహిన్, ఎంపీపీ బూక్యా సుశీల రవీందర్, ఎంపీడీవో ఉమాదేవి, ఏపీవో రవీందర్‌రెడ్డి, ఈసీ కరుణాకర్, ఎంపీటీసీలు గిద్దె కరుణాకర్, కానుగంటి శ్రీనివాస్, సర్పంచ్ నామసాని సత్యనారాయణ, అయినాల మహేందర్‌రెడ్డి, ఉపాధి హామీ సిబ్బంది ఉన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...