మంత్రి జగదీశ్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ


Fri,July 19, 2019 12:57 AM

మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి జన్మదిన వేడుకలను ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు గురువారం ఘనంగా నిర్వహించారు. పలువురు ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయా మండలాల టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో మంత్రి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌కట్ చేసి పంచిపెట్టారు. పలు సేవాకార్యక్రమాలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి హైదరాబాద్‌లోని మంత్రి నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. అలాగే రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు బొంగు స్వామిగౌడ్, మాజీ డీసీసీబీ డైరెక్టర్ పిల్లలమర్రి శ్రీనివాస్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకురాలు కాసోజు శంకరమ్మ తదితర టీఆర్‌ఎస్ నాయకులు మంత్రి జగదీశ్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
-చౌటుప్పల్ జోన్, బృందం

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...