సీపీఎస్‌ను రద్దు చేయాలి


Fri,July 19, 2019 12:57 AM

మోత్కూరు : ఉద్యోగులకు శాపంగా మారిన సీపీఎస్‌ను రద్దు చేయాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మెతుకు సైదులు కోరారు. గురువారం మండలంలోని బుజిలాపురం , దాచారం, పాలడుగు, పాటిమట్ల తదితర గ్రామాల్లో నిర్వహించిన సభ్యత్వ నమోదులో పాల్గొని మాట్లాడారు. పాఠశాలలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక పోవడంతో విద్యా వ్యవస్థ కుంటు పడిందన్నారు.ప్రభుత్వం తక్షణమే సర్వీస్ రూల్స్ రుపొందించి డీఈవో, ఎంఈవో పోస్టులు, బాషా పండితుల, పీఈటీల పోస్టులను భర్తి చేయాలన్నారు. విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కారం చేయాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం 20న జిల్లా కేంద్రాల్లో జరుగనున్న ధర్నాలను విజయ వంతంచేయాలన్నారు. కార్యక్రమంలో అధ్యక్ష, కార్యదర్శులు ఏ వెంకటాచారి, డి నరేశ్, ఉపాధ్యాయులు వారాల యాదగిరి, టీ ఉప్పలయ్య, జి మల్లేశ్, డి శ్రీనివాస్, ఏ సత్తయ్య, బి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

టీఎస్‌యూటీఎఫ్‌లో చేరిక..
టీఎస్ యూటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా గురువారం జరిగిన కార్యక్రమంలో టీపీయూఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు బందారపు దుర్గా ప్రసాద్ టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మెతుకు సైదులు సమక్షంలో చేరారని మండలాధ్యక్షుడు ఏ వెంకటాచారి ఒక ప్రకటనలో తెలిపారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...