మహాత్మాలో నిర్మాణాలు భవిష్యత్‌కు ఉపయుక్తం


Fri,July 19, 2019 12:56 AM

ఎంజీయూనివర్సిటీ: మహాత్మాగాంధీ యూనివర్సిటీలో నూతనంగా చేపడుతున్న నిర్మాణాలు భవిష్యత్‌కు ఎంతో ఉపయుక్తమని ఎంజీయూ ఇన్‌చార్జి వీసీ, ఓయూ వీసీ ప్రొ. ఎస్.రామచంద్రం తెలిపారు. నల్లగొండలోని ఎంజీయూ ఇన్‌చార్జి వీసీగా నియామకమైన ఆయన గురువారం తొలి పర్యాయం ఇన్‌చార్జి వీసీ హోదాలో ఎంజీయూకు వచ్చారు. ఆయనకు రిజిస్ట్రార్ ప్రొ. యాదగిరి, ఆడిట్ సెల్ డైరెక్టర్ డా. అల్వాల రవి పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఎంజీయూ ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న వీసీ, స్టాఫ్ క్వార్టర్స్, ఇంజినీరింగ్ కళాశాల భవనాలు, అదనపు హాస్టల్ నిర్మాణాలు, క్రీడా మైదానాలు, పరీక్షల విభాగం ని ర్మాణాలతో పాటు యూనివర్సిటీ కళాశాలలైన సైన్స్, ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజిమెంట్ కళాశాలలు, సెంట్రల్ లైబ్రరీలను ఆయ న పరిశీలించారు. అనంతరం వీసీ చాంబర్‌లో యూ నివర్సిటీ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఎంజీయూ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరితహారంలో పాల్గొని మొక్కలు నాటినీరు పోశారు. కా ర్యక్రమంలో ఎంజీయూ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డా. దోమల రమేశ్, సీఓఈ డా. మిర్యాల రమేశ్‌కుమార్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు డా. చిలుకూరి రమే శ్, ఎల్. మధు, హాస్టల్స్ డైరెక్టర్ మారం వెంకటరమణారెడ్డి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా. కొప్పుల అంజిరెడ్డి పాల్గొన్నారు.

వీసీ రాకపై గోప్యత..!
మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఇన్‌చార్జి వీసీగా నియామకమైన ఓయూ వీసీ ప్రొ॥ఎస్.రామచంద్రన్ గురువారం తొలి పర్యాయం ఎంజీయూకు వచ్చారు. అయితే ఈ విషయాన్ని మీడియాకు గానీ ఇతరులకు గానీ తెలియకుండా గోప్యత పాటించారు. ఈ గోప్యతను ఎందుకు పాటించారో అనే విషయంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే మధ్యా హ్న భోజనం ముగియగానే కనీసం సందర్శకులకు కూడా పూర్తి స్థాయిలో సమయం కేటాయించకుండా హడావిడిగా పంపించారు.

ఇన్‌చార్జి వీసీని కలిసిన అధ్యాపకులు
ఎంజీయూ ఇన్‌చార్జి వీసీ రామచంద్రన్‌ను అక్ర మ నియామకాలు అనే అంశంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న అధ్యాపకులు కలిశారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...