కారు జోరు


Thu,July 18, 2019 12:53 AM


- టీఆర్‌ఎస్‌లో భారీ చేరికలు
-చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ బ్లాక్, మండలాధ్యక్షుడు చింతల వెంకట్‌రెడ్డి, గుండుమల్లయ్యగౌడ్, సీనియర్ నేత వెన్‌రెడ్డి రాజు చేరిక
- మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల, మాజీ ఎంపీ బూర ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సమక్షంలో 200 మందికి పైగా గులాబీ కండువాలు కప్పుకున్న కాంగ్రెస్ నేతలు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్న ఎంపీపీ వెంకట్‌రెడ్డి తదితరులు


రాజాపేట : జల వనరుల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జలశక్తి అభియాన్ పథకాన్ని ప్రవేశ పెట్టిందని కేంద్ర ప్రభుత్వ నీతి అయోగ్ సలహాదారుడు అవినాశ్ మిశ్రా, కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ మనీశ్‌కుమార్ అన్నారు. బుధవారం జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని నర్సాపురం, రాజాపేట, బొందుగుల, పారుపల్లి గ్రామాల్లో కలెక్టర్ అనితారాంచంద్రన్‌లతో కలిసి ఉపాధిహామీ పథకంలో చేపట్టిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నర్సాపురంలో ఖండిత కందకాలు, నర్సిరీలోని మొక్కల పెంపకం, డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో చేపడుతున్న సాగు, తోటల పెంపకం, కురగాయల సాగు, గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణాలను పరిశీలించారు. అదేవిధంగా బొందుగులలో చెరువు, కుంటలు, చెక్‌డ్యాంలు, హరితహారంలో నాటిన ఈత, ఖర్జూర మొక్కలను పరిశీలించారు.

రాజాపేటలో భూగర్భ జలాల నీటి మట్టాన్ని తెలిపే పీజో మీటర్‌ను పరిశీలించారు. అంతకు ముందు నర్సాపురంలో విద్యార్థులు, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులతో జలశక్తి అభియాన్ ర్యాలీ నిర్వహించారు. హరితహారంలో భాగంగా బొందుగుల, రాజాపేటలో మొక్కలు నాటారు. అనంతరం మండల కేంద్రంలోని అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో భూగర్భ జలాలు అడుగంటి పోయి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న మండలాలను 254 జిల్లాల్లో 1770 గుర్తించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 137 మండలాలకు గాను జిల్లాలో భువనగిరి, రాజాపేట, తుర్కపల్లి, గుండాల మండలాలను గుర్తించారన్నారు. జల సంరక్షణ కోసం వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు గాను ఫారంపాండ్స్, ఖండిత కందకాలు, సంకెన్‌ఫిట్స్, ఇంకుడు గుంతలు, చెక్‌డ్యాంలు, నీటి కుంటలు నిర్మించుకుంటే భూగర్భ జలాలు పెంపొందించుకోవచ్చునన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న హరితహారం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు భేష్‌గా ఉన్నాయని కొనియాడారు. అటవీ, గ్రామీణ అభివృద్ధి, ఉద్యానవన, వ్యవసాయ, భూగర్భ జలవనరుల, ఇరిగేషన్ శాఖల కార్యచరణ ప్రణాళికను అనుసంధానం చేసుకొని, జల సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. గత పదేండ్లుగా ఈ ప్రాంతంలో అతి తక్కువ వర్షపాత నమోదైందని తెలిపారు.

హరితహారంలో మొక్కలను పెంపకాన్ని అధికంగా చేపడితే శాశ్వతంగా కరువు దూరం చేసుకోవచ్చునన్నారు. జలశక్తి అభియాన్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఎక్సెజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ, డీపీవో జగదీశ్, పీడీ సురేశ్, డిప్యూటీ డైరెక్టర్ జ్యోతి కుమార్, ఏపీడీ శ్యామల, ఇరిగేషన్ ఈఈ రామచందర్, స్వాతి, నాగేశ్వరావు, ఎంపీపీ గోపగాని బాలమణీయాదగిరిగౌడ్, జడ్పీటీసీ చామకూర గోపాల్‌గౌడ్, వైస్ ఎంపీపీ కాయితి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో రామరాజు, ఏపీవో పరుశురాం, ఏవో మాధవి, సర్పంచ్‌లు కంచర్ల శ్రీనివాస్‌రెడ్డి, నాగిర్తి గోపిరెడ్డి, ఆడేపు ఈశ్వరమ్మాశ్రీశైలం, భాగ్యమ్మ, ఠాకూర్ ధర్మేందర్‌సింగ్, రాజు, దేవి, ఎంపీటీసీలు ఎడ్ల నరేశ్‌రెడ్డి, బొద్దుల మౌనిక, స్వరూప, దాచపల్లి రాజు, మదర్‌డెయిరి డైరెక్టర్ అర్కాల గాల్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులున్నారు.

రిజర్వు ఫారెస్టు పరిశీలన..
భువనగిరి, నమస్తే తెలంగాణ : మండలం పరిధి రాయగిరి సమీపంలోని రిజర్వు ఫారెస్టు-1ను జలశక్తి అభియాన్ జిల్లా నోడల్ అధికారి, నీతి అయోగ్ సీనియర్ సలహాదారు అవినాశ్‌మిశ్రా, కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ మనీశ్‌కుమార్, జిల్లా అధికారులు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అభయారణ్యంలోని మొక్కలు, బ్లాకు ప్లాంటేషన్, భూసార పరీక్ష, ట్యాంకుల పనులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం అభయారణ్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్లురెడ్డి, ఇన్‌చార్జి పంచాయతీ అధికారి వెంకట్‌రెడ్డి, హార్టికల్చర్ అధికారి సురేశ్ పాల్గొన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...